Prabhas: డైరెక్టర్స్ అసోసియేషన్ కి ప్రభాస్ భారీ విరాళం.. ప్రశంసిస్తున్న దర్శకులు..

Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గొప్పతనం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు విన్నాం. ఇంటికి వచ్చిన వారిని కడుపునిండా భోజనం పెట్టకుండా పంపించని ప్రభాస్ సహాయం కోరి వచ్చిన వారిని కూడా సహాయం చేయకుండా వెనక్కి పంపరు. తాజాగా ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం భారీ మొత్తాన్ని డొనేషన్ ప్రకటించి అందరి మనసులను దోచుకున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 23, 2024, 03:18 PM IST
Prabhas: డైరెక్టర్స్ అసోసియేషన్ కి ప్రభాస్ భారీ విరాళం.. ప్రశంసిస్తున్న దర్శకులు..

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ కంటే ఆయన మనసే ఇంకా విశాలమైనది. సహాయం కోరి వచ్చిన ఎవరిని ఉట్టి చేతులతో పంపించని గొప్ప వ్యక్తి ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ ఎంతో మందికి సహాయం చేశారు. గతంలో కూడా చాలా డొనేషన్స్ ఇచ్చారు. ప్రభాస్ చేసిన ఎన్నో మంచి పనులు మీడియా ముందుకు రాకుండానే ఉండిపోయాయి. కానీ కొన్ని మాత్రం అభిమానులను చేరాయి.

అందులో ఒకటి తాజాగా ప్రభాస్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి ఇచ్చిన డొనేషన్. ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంటికి ఎవరు వచ్చినా కడుపునిండా భోజనం పెట్టి మరీ పంపించే ప్రభాస్ తాజాగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి భారీ మొత్తంలో డొనేషన్ ఇచ్చారు. 

ప్రముఖ నటుడు, డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు జన్మదిన సందర్భంగా మే 4న ప్రతి ఏటా డైరెక్టర్స్ డే గా టాలీవుడ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది కూడా స్టేడియం లో బోలెడు మంది జనాల మధ్య టాలీవుడ్ ప్రముఖుల అందరి సమక్షంలో ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 

ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ మారుతి డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రభాస్ 35 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దర్శకుల సంఘం ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరోవైపు దర్శకుల సంఘానికి నిర్మాత ఎస్ కే ఎన్ కూడా 10 లక్షల డొనేషన్ ప్రకటించారు. ఇక ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న కల్కి 2898 ఏడీ త్వరలోనే విడుదల కు సిద్ధం కాబోతోంది. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

Also Read: Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరిక

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News