Prabhas: ప్రభాస్ వల్లే హీరో అవ్వాలి అనుకున్నాను.. నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

Prabhas Movies: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు హీరో ప్రభాస్. ఈ హీరోకి సినీ ప్రేక్షకుల్లోనే కాదు సినీ సెలబ్రిటీస్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో హీరో నవీన్ చంద్ర ప్రభాస్ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 10, 2024, 02:27 PM IST
Prabhas: ప్రభాస్ వల్లే హీరో అవ్వాలి అనుకున్నాను.. నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

Naveen Chandra:

అందాల రాక్షసి సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. ఆ తరువాత హీరో గానే కాకుండా వైవిద్యమైన పాత్రల్లో కనిపిస్తూ అందరిని మెప్పిస్తూ వచ్చాడు ఈ హీరో. కాగా నవీన్ చంద్ర ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తను సినిమాల్లోకి రావడానికి గల కారణాలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ హీరో ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. అయితే ఆ సినిమా విడుదలకు ముందే ఆయనకు తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈశ్వర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో వర్షం సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి అంజి, బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాలతో విడుదలైన ప్రభాస్ వర్షం సినిమా ఆ సినిమాల కలెక్షన్స్ రేంజ్ దాటి 2004 సంక్రాంతి సీజన్ విన్నర్ గా నిలిచింది. అప్పట్లో ఆ చిత్రం సెన్సేషనల్ విజయం సాధించి ప్రభాస్ ని మాస్ హీరోగా నిలబెట్టింది.

ఈ సినిమా 50 రోజుల ఫంక్షన్ అప్పుడు భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహించారు సినిమా యూనిట్.
ఇక ఈ ఫంక్షన్ లో ఇప్పటి హీరో నవీన్ చంద్ర డాన్సర్ గా స్టేజి పై డాన్స్ వేశారట. ఈ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా చెప్పుకొచ్చారు.ఇక ఆ ఫంక్షన్ కి ప్రభాస్ కోసం వచ్చిన జనాల్ని చూసి నవీన్ చంద్ర షాక్ అయ్యారట.
‘దాదాపు ఐదు లక్షల మందికి పైగా ప్రభాస్ ని చూడడం కోసం వర్షం 50 డేస్ ఫంక్షన్ కి వచ్చారు. వర్షం ప్రభాస్ కి కేవలం మూడో సినిమా. ఆ టైములోనే అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నేను షాక్ అయ్యాను. హీరో అవ్వాలనే నాకు అప్పుడే అనిపించింది. హీరో అవుతే ఇంతటి ఫాలోయింగ్ వస్తుందా అని నేను ఆశ్చర్యపోయాను, అయితే నేను హీరోని అవుతా.. అని ఫిక్స్ అయ్యా,’ అని చెప్పుకొని వచ్చారు నవీన్ చంద్ర. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

కాగా అప్పట్లో వర్షం సినిమా 175 డేస్ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఒకే వేదిక పై కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్ కనిపించి ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేసారు. ఈ మధ్య ఈ సినిమా రీ- రిలీజ్ కూడా అయ్యి సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ తెచ్చుకునింది.

Also Read: Pawan Chiranjeevi Meet: పవన్‌ కల్యాణ్‌కు చిరంజీవి ఆశీర్వాదం.. రూ.5 కోట్ల విరాళంతో భరోసా ఇచ్చిన 'అన్నయ్య'

Also Read: Pawan Kalyan: జగన్‌లాంటి 'కోడిగుడ్డు' ప్రభుత్వం ఇంకా కావాలా? పవన్‌ కల్యాణ్‌

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News