Kalki 2898AD: ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నాగార్జున.. క్రేజీ కాంబినేషన్ అంటున్న ఫ్యాన్స్..

Prabhas Kalki : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా గురించిన పలు ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నారు అనే వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 8, 2024, 11:05 AM IST
Kalki 2898AD: ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో నాగార్జున.. క్రేజీ కాంబినేషన్ అంటున్న ఫ్యాన్స్..

Nagarjuna in Kalki

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫాంటసీస్ సైంటిఫిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఎన్నో పుకార్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కథ గురించి రూమర్లు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉండబోతోంది అని, క్లైమాక్స్ లో వచ్చే కీలక సన్నివేశాల్లో పరశురాముడి పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారని, అలాగే కృష్ణచార్యుడి పాత్రలో నాచురల్ స్టార్ నాని దర్శనం ఇవ్వబోతున్నారు అని పుకార్లు వినిపించాయి. దీంతో అభిమానులకి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

అయితే ఆ పుకార్లలో నిజానిజాలు ఇంకా తెలియదు కానీ కథ ప్రకారం గా ఈ సినిమాలో పరశురాముడు పాత్ర కీలకంగా ఉండబోతోంది. కాబట్టి ఆ పరశురాముడి పాత్రలో ఓ స్టార్ హీరో అయితేనే బాగుంటుంది అని దర్శక నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ పాత్ర లో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ఇప్పుడు కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. 

దీని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దిశ పటానికి కూడా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. 

ఇంత పెద్ద స్టార్ట్ లతో ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం అన్నీ భారతీయ భాషలలో విడుదల కి సిద్ధమవుతోంది. వైజయంతి మూవీస్ పథకంపై అశ్విని దత్ ఈ సినిమానే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News