యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?

యమహా నుంచి ఇవాళే మరో కొత్త బైక్ మార్కెట్లోకి లాంచ్ అయింది. YZF-R15 V3.0 పేరిట లాంచ్ అయిన ఈ యమహా బైక్ ఖరీదు లక్షా 57 వేల రూపాయలు. యూనిబాడీ సీట్ డిజైన్‌తో రూపొందిన యమహా YZF-R15 V3 బైక్ 155CC ఇంజన్‌ను అమర్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 10:48 PM IST
  • యమహా నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన మరో కొత్త బైక్
  • యమహా బైకులకు భారీ డిమాండ్ కనిపిస్తోందన్న మోటోఫుమి
  • మార్కెట్లోకి యమహా YZF-R15 V3 బైక్
యమహా నుంచి మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ధర ఎంతో తెలుసా ?

యమహా నుంచి ఇవాళే మరో కొత్త బైక్ మార్కెట్లోకి లాంచ్ అయింది. YZF-R15 V3.0 పేరిట లాంచ్ అయిన ఈ యమహా బైక్ ఖరీదు లక్షా 57 వేల రూపాయలు. యూనిబాడీ సీట్ డిజైన్‌తో రూపొందిన యమహా YZF-R15 V3 బైక్ 155CC ఇంజన్‌ను అమర్చారు. 150 సిసి స్పోర్ట్ సెగ్మెంట్‌లో సూపర్ సక్సెస్ మోడల్‌గా YZF-R15 ని యమహా అభివర్ణించింది. పికప్, వేగం కోసం సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో లాంచ్ అయిన ఈ బైక్ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని యమహా పేర్కొంది. 

కస్టమర్స్ అభిప్రాయాలకు విలువ ఇస్తూ వారి డిమాండ్స్ కి అనుగుణంగా ఈ YZF-R15 v3 బైకుని తీర్చిదిద్దడం జరిగిందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమి శితారా తెలిపారు. 2018 నుంచి R15 యమహా బైకులకు భారీ డిమాండ్ కనిపిస్తోందని మోటోఫుమి అన్నారు. 

Also read : OnePlus Nord 2 Pac-Man smartphone: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర

2018 జనవరి నుంచి 2021 అక్టోబర్ వరకు 2 లక్షల 76 వేల 445 యూనిట్స్ విక్రయాలు జరిగాయి. యమహా బైకులకు పెరిగిన క్రేజుకు, డిమాండుకు ఇదే నిదర్శనంగా భావించవచ్చని మోటోఫుమి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యమహా బైక్స్‌కి మరింత డిమాండ్ పెరగడం ఖాయం అని మోటోఫుమి ఆశాభావం వ్యక్తంచేశారు.

Also read : OPPO foldable smartphones: ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయ్

Also read : Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఈ-మోటార్​ సైకిళ్లు- ఆ తర్వాత విద్యుత్ కార్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News