Bajaj Pulsar NS400Z: గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా

Bajaj Pulsar NS400Z: మార్కెట్‌లో బజాజ్ కంపెనీ బైక్స్‌కు ఆదరణ ఎక్కువే. ఫీచర్లు, మైలేజ్‌పరంగానే కాకుండా యువతను ఆకట్టుకునే డిజైన్‌తో ఉంటాయి. అందుకే బజాజ్ పల్సార్ మార్కెట్‌లో ఎక్కినంతగా మరే ఇతర బైక్ ప్రాచుర్యం పొందలేదు. ఇప్పుడు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2024, 12:26 PM IST
Bajaj Pulsar NS400Z: గంటకు 154 కిలోమీటర్ల వేగంతో కొత్త పల్సార్ బైక్, ధర ఫీచర్లు ఇలా

Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైక్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంటుంది. ఇప్పటికీ బజాజ్ కంపెనీకు చెందిన పల్సార్ అంటే యువతకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడీ బైక్‌కు అడ్వాన్స్ వెర్షన్ బజాజ్ పల్సార్ NS400Z లాంచ్ అయింది. ఈ బైక్ ఫీచర్లు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Bajal Pulsar NS400Zలో 373 సిసి ఇంజన్ ఉంటుంది. ఇది 39 హెచ్‌పి వపర్, 35 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో గరిష్టంగా ఆరు గేర్లుంటాయి. టాప్ స్పీడ్ గంటకు 154 కిలోమీటర్ల వేగం వెళ్లగలదు. 373 సిసి ఇంజన్ ఇందులోనే కాదు గతంలో బజాజ్ లాంచ్ చేసిన పల్సార్ ఎన్ 250, కేటీఎం 390 డ్యూక్, డామినార్ 400లో కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన Bajal Pulsar NS400Z బైక్ రెడ్ , బ్లాక్ , వైట్ మూడు రంగుల్లో లభ్యమౌతోంది. కేవలం 5 వేల డిపాజిట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ షోరూం ధర 1.85 లక్షలుగా ఉంది. 

Bajal Pulsar NS400Z మొత్తం బరువు 174 కిలోలుంటుంది. డబుల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఈ బైక్ ఆన్ రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతుంటుంది. హైదరాబాద్ ఆన్ రోడ్ ధర 14,800 రూపాయలు రోడ్ ట్యాక్స్, 5,272 రూపాయలు ఇన్సూరెన్స్  తో కలుపుకుని 2 లక్షల 5 వేల 72 రూపాయలుంటుంది. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉంటుంది. 

Bajal Pulsar NS400Zకు పోటీగా మార్కెట్ లో Yamaha MT 15 V2 ఉంది. ఈ బైక్ ప్రారంభ ధర 1.69 లక్షలుగా ఉంది. ఇందులోనే V4 ్యితే 1.83 లక్షలుంది. 

Also read: Form 16 Info: ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడొస్తుంది, ఐటీ రిటర్న్స్‌లో ఎందుకు అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News