Who is Siddharth Luthra: చంద్రబాబు కేసుతో బిజీ అయిన సుప్రీం కోర్టు అడ్వకేట్.. సుప్రీం కోర్టులో సునితా రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

Who is Siddharth Luthra: ఢిల్లీ: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది. 

Written by - Pavan | Last Updated : Sep 12, 2023, 04:56 AM IST
Who is Siddharth Luthra: చంద్రబాబు కేసుతో బిజీ అయిన సుప్రీం కోర్టు అడ్వకేట్.. సుప్రీం కోర్టులో సునితా రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

Who is Siddharth Luthra: ఢిల్లీ: సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది. తన తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు అడ్వకేట్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సునీతా రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో పిటిషనర్ విజ్ఞప్తి మేరకు ఆమె అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A8 ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి  మే 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ హై కోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి  మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో సునీత రెడ్డి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.  

వైఎస్ సునితా రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన తరువాత అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని దర్యాప్తు చేస్తోన్న సిబిఐ సైతం ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. 

తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని ఆరోపించిన సునితా రెడ్డి.. ఈ కేసు దర్యాప్తుకి సహకరించకుండా అవినాష్ రెడ్డి తప్పించుకుంటున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సిబిఐ.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కుట్ర చేశారంటూ తమ అఫిడవిట్‌లో ఆరోపించింది. 

రాజకీయ వైరంతోనే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని స్పష్టం చేసిన సిబిఐ.. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున తెలంగాణ హై కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ని రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో వేడుకుంది. వివేకానంద రెడ్డి వెంట కారులో ప్రయాణిస్తూనే గంగిరెడ్డి నిందితుడు సునీల్ యాదవ్ కి ఫోన్ చేసినట్లు పేర్కొన్న సిబిఐ.. ఆ సమయంలో నిందితుడు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు స్పష్టంచేసింది. వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి , ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలే ప్రధాన సూత్రదారులు అనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. 

ఇదిలావుంటే, ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సుప్రీం కోర్టులో సునితా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రాగా.. ఆ కేసుని వాదిస్తున్న సునితా రెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన కేసు విచారణలో బిజీగా ఉన్నారు. ఈ కారణంగానే సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ మరో మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

Trending News