K Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతది

Revanth Reddy Govt Not In Power On August: లోక్‌సభ ఎన్నికలు అలా ముగిసిన తర్వాతి రోజే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆగస్టులోపు రేవంత్‌ రెడ్డి ఉండదని ఆ పార్టీ ఎంపీ కె లక్ష్మణ్‌ జోష్యం చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 14, 2024, 05:15 PM IST
K Laxman: ఇక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉండదు.. ఆగస్టులో కుప్పకూలుతది

K Laxman Vs Revanth Reddy: తెలంగాణలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆగస్టు తర్వాత ఉండదని బీజేపీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఎవరూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జోలికి పోరని పేర్కొంటూనే.. రేవంత్‌ మంత్రివర్గంలోని వారే కూలుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల విషయమై ప్రస్తావిస్తూ.. ఎన్నికల సరళి చూస్తుంటే బీజేపీ అన్నీ స్థానాల్లో ముందంజలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్టీల కంటే మెజారిటీ స్థానాలు సాధిస్తామని ప్రకటించారు.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

 

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో లక్ష్మణ్‌ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ సరళి ఏకపక్షంగా మోడీ వైపు మొగ్గు చూపినట్టు అర్థమవుతోందని తెలిపారు. బీజేపీ 370 స్థానాలు, ఎన్డీయే కూటమి 400 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితులు లేవని జోష్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని తెలిపారు.

Also Read: Dk Aruna: రేవంత్ జూటా మాటలు మాట్లాడుతున్నారు.. పోలింగ్ వేళ ఫైర్ అయిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ..

 

రాష్ట్రంలోని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై లక్ష్మణ్‌ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు ఫలించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ ప్రయాణిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వo చేసిన అప్పులు కట్టేందుకు కొత్త అప్పులు తెచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలిపారు. కాళేశ్వరం, ధరణి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీని కేసీఆర్‌ కూటమిలో లేదా కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కె.లక్ష్మణ్‌ తెలిపారు. గ్రామం నుంచి పట్నం వరకు అన్ని సామాజిక వర్గాలు మోడీకి వెన్నుదన్నుగా నిలబడ్డాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమిని నమ్మే పరిస్థితుల్లో దేశ ప్రజలు లేరని చెప్పారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ అప్పుల ఊబిలో పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకతే కాదు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News