Fever Diet: జ్వరాన్ని సులభంగా తగ్గించే ఎంతో ఎఫెక్టివ్ డైట్.. తప్పకుండా తెలుసుకోండి!

Fever Diet In Telugu: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఎండల్లో అటు ఇటు తిరగడం కారణంగా జ్వరం ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో జ్వరం రావడం సర్వసాధారణం.. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడితే తప్పకుండా దీని నుంచి ఉపశమనం పొందడానికి ఇలా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 5, 2024, 04:58 PM IST
Fever Diet: జ్వరాన్ని సులభంగా తగ్గించే ఎంతో ఎఫెక్టివ్ డైట్.. తప్పకుండా తెలుసుకోండి!

Best Fever Diet In Telugu: ఎండల్లో ఎక్కువగా తిరగడం కారణంగా చాలామందిలో సాధారణ జ్వరం వస్తూ ఉంటుంది. మరికొంతమందిలోనైతే జ్వరంతో పాటు డీహైడ్రేషన్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి జ్వరం తీవ్రత పెరగకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో తీసుకునే ఆహారాలు కూడా జ్వరంపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి తప్పకుండా జ్వరంతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. కొంతమంది అయితే ఈ సమయంలో విచ్చలవిడిగా ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఆహారం తినే క్రమంలో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.

అధిక జ్వరంతో బాధపడుతున్న వారు తప్పకుండా అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని తినడం వల్ల జ్వరం తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అనేక ఇన్ఫెక్షన్లు బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జ్వరంతో బాధపడేవారు అధిక ఆహారం తినడం మానుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణక్రియ చాలా లేటుగా పనిచేస్తుంది కాబట్టి అతిగా తినడం కారణంగా జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చు. అంతేకాకుండా కొంతమందిలో అధికంగా ఆహారాలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగవచ్చు.

అలాగే జ్వరంతో బాధపడేవారు 24 గంటల పాటు ఉపవాసాలు ఉండడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత బయటికి వెళ్లే అవకాశాలున్నాయి. ఉపవాస సమయంలో హెల్తీ డ్రింక్స్ తీసుకోవడం మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా ఏర్పడి వ్యర్ధపదార్థాలు మూత్రం ద్వారా బయటికి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. జ్వరంతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో తేనెతో తయారుచేసిన డ్రింక్స్ గాని, ఆహారాలు గాని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

చాలామంది జ్వరంతో బాధపడేవారు శరీర ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకొని చల్లని ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కూడా చెమటలు బయటికి వస్తాయి. అలాగే ఈ చెమట రూపంలోనే టాక్సిన్స్ బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూలర్స్ ఏసీల దగ్గర కూర్చోకూడదు. కూర్చోవడం వల్ల శరీరం నుంచి వచ్చే చెమట మొత్తం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు విషపదార్థాలు కూడా బయటికి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News