Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..

Prabhas: ప్రభాస్ ఎన్నడు లేనట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ తన పెళ్లి గురించేనా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 02:16 PM IST
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన పోస్ట్.. అర్ధం అదేనా..

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు ప్రభాస్‌దే. ఇప్పటికే ఆయనకన్న చిన్నవాళ్లు ఎందరో తమ బ్యాచిలర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టారు. కానీ ప్రభాస్ మాత్రం 45 యేళ్లు వస్తున్న ఇంకా స్టిల్ బ్యాచిలర్‌గానే ఉన్నారు. తాజాగా ప్రభాస్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. డార్లింగ్స్.. ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తన పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతో కలలు కన్నారు. ఆయన ఆ కోరిక తీరకుండానే కన్నుమూసారు. ఆయన చనిపోయి యేడాది పూర్తైయిన సందర్భంగా ఇపుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది. త్వరలోనే ప్రభాస్.. తన అభిమానులకు పప్పన్నం పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రావణం వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. అపుడే ఈయన మూడు ముళ్లతో ఏడడుగులు వేస్తారా అనేది చూడాలి. లేకపోతే .. ఇయర్ ఎండింగ్‌లో పెళ్లి పీఠలు ఎక్కుతాడా అనేది చూడాలి.

ప్రభాస్.. అనుష్కను చేసుకుంటున్నారా... లేకపోతే.. తనకు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ పెట్టిన పోస్ట్ పెళ్లికి సంబంధించనదే కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కితే చూడాలనుకునే అభిమానులు చాలా మందే ఉన్నారు.

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' మూవీ చేసాడు. ఈ సినిమా వచ్చే నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరోవైపు ప్రభాస్.. సలార్ 2 మూవీ షూటింగ్ చేయబోతున్నాడు. అటు మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్' మూవీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్టు సమచారం. మరోవైపు కన్నప్ప మూవీ కూడా ఈ యేడాదే విడుదల కాబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు హను రాఘవపూడి సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. యేడాది చివర్లో సందీప్ రెడ్డి వంగా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. బాలీవుడ్‌లో సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో మూవీ వచ్చే యేడాది పట్టాలెక్కబోతుంది. మొత్తంగా ప్రభాస్ యేడాదికి రెండు సినిమాలు చొప్పున రిలీజ్ చేయాలనే కసితో ఉన్నాడు.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News