Kalki2898AD: కల్కి2898ADలో రానా ఉన్నారా? క్లారిటీ ఇచ్చేసిన హీరో

Kalki2898AD Update: ప్రస్తుతం పాన్-ఇండియా ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి2898AD. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వస్తున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారని వార్తలు గట్టిగా వినిపించాయి.. ఇక ఈ వార్తపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశాడు హీరో రానా..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 5, 2024, 04:19 PM IST
Kalki2898AD: కల్కి2898ADలో రానా ఉన్నారా? క్లారిటీ ఇచ్చేసిన హీరో

Rana about Kalki2898AD: ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా కల్కి2898AD. మే 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అలానే ఐపిఎల్ వల్ల పోస్ట్ పోన్ అయ్యి జూన్ లో విడుదల కాబోతోంది. వైజయంతి మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దాదాపు 800 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు వినికిడి.

ఇక జూన్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని అప్పుడే మొదలు పెట్టేసారు చిత్ర యూనిట్. కల్కి సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దుల్కర్ సల్మాన్ ,దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది నటులు ఈ చిత్రంలో కనిపించనున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. రానా కల్కి కామిక్ కాన్ ఈవెంట్లో  పాల్గొనడం, అలానే ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా వరకు పాల్గొనడం.. ఈ చిత్రంలో రానా ఉన్నారు అనే వార్తకు ఆర్జం పోసింది. 

ఈ క్రమంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు ఈ హీరో. తాజాగా రానా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్, నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి మంచి స్నేహితులం. లీడర్ సినిమాకి శేఖర్ కమ్ముల వద్ద నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు. అలా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రెగ్యులర్ గా కలుస్తాము, సినిమాల గురించి మాట్లాడతాము. కల్కి ఇండియా సినిమా రూపురేఖలు తప్పకుండా మారుస్తుంది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలని కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్ళాము. ఇండియాకి ఎవెంజర్స్ లాంటి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. అయితే నేను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాను కాబట్టి నేను యాక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ నేను కల్కి సినిమాలో యాక్ట్ చెయ్యట్లేదు’.. అంటూ అసలు విషయం బయటపెడుతూ రూమర్స్ కి చెక్పెట్టారు ఈ హీరో.

Read more: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News