US Shooting: ఫ్యాక్టరీలో ముగ్గురు కాల్చివేత.. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌ స్కూల్ ఘటన మరవకముందే పశ్చిమ మేరీ ల్యాండ్ లో మరో ఘటన జరిగింది. స్మిత్‌బర్గ్‌లో అగంతకుడు కాల్పులు జరిపాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ దుండగుడు.. తన దగ్గర ఉన్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.  

Written by - Srisailam | Last Updated : Jun 10, 2022, 08:13 AM IST
  • అమెరికాలో మళ్లీ కాల్పుల మోత
  • పశ్చిమ మేరీ ల్యాండ్ లో దుండగుడి కాల్పులు
  • కాల్పుల్లో ముగ్గురు మృతి
US Shooting: ఫ్యాక్టరీలో ముగ్గురు కాల్చివేత.. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

US Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌ స్కూల్ ఘటన మరవకముందే పశ్చిమ మేరీ ల్యాండ్ లో మరో ఘటన జరిగింది. స్మిత్‌బర్గ్‌లో అగంతకుడు కాల్పులు జరిపాడు. కొలంబియా మెషిన్ ఫ్యాక్టరీలోకి చొరబడ్డ దుండగుడు.. తన దగ్గర ఉన్న గన్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ  కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

యూఎస్ మీడియా వివరాల ప్రకారం వెస్ట్ మేరీ ల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరానికి 75 మైళ్ల దూరంలో ఉన్న స్మిత్స్‌బర్గ్‌లోని కొలంబియా మెషిన్ తయారీ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగిది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్యాక్టరీలోకి చొరబడిన దుండగుడు.. కనిపించివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులపై దుండగుడు ఫైర్  చేశాడు. పోలీసులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డారు. గాయపడిన దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.

అమెరికాలో కొన్ని రోజులుగా గన్ కల్చప్ పెరిగిపోతోంది. వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. న్యూయార్క్, టెక్సాస్, ఓక్లహోమాలో జరిగిన కాల్పుల ఘటనల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. టెక్సాస్ లో స్కూల్ లో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు సహా 22 మంది మృతి చెందారు. గత ఏడాదిలో యూఎస్ లో తుపాకీ హింస కారణంగా 17,000 మందికి పైగా మరణించడమో లేదా గాయపడటంతో జరిగింది. ఒక్క ఏడాదిలోనే అమెరికాలో 110 కాల్పుల ఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించవచ్చు. కొవిడ్ మహమ్మారి సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అంతరాల వల్లే ఈ విష సంస్కృతి పెరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గన్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు చట్టాలను మరింత కఠినం చేసేలా జోబైడన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుపాకుల కొనుగోళ్లపై బ్యాన్ విధించింది.

Read also:Jitta Balakrishna Reddy: బీజేపీ నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి అరెస్ట్.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసిన పోలీసులు

Read also: JOB News: యవతకు గుడ్‌న్యూస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News