అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు : అమెరికాలో ఎన్నారైల కోరికలు తీర్చే ఉచ్చులో కొంతమంది తెలుగు, కన్నడ హీరోయిన్స్ !

అమెరికాలోని ధనవంతులైన భారతీయ విటుల కోసం బాధితులను తీసుకెళ్లిన జంట

Last Updated : Jun 15, 2018, 03:59 PM IST
అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు : అమెరికాలో ఎన్నారైల కోరికలు తీర్చే ఉచ్చులో కొంతమంది తెలుగు, కన్నడ హీరోయిన్స్ !

అమెరికాలో ప్రదర్శనలు, సమావేశాల పేరిట తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన హీరోయిన్స్‌ను అక్కడికి పిలిపించుకుని అక్కడ డబ్బున్న భారతీయ ధనవంతుల సెక్స్ కోరికలు తీర్చే వ్యాపారం చేస్తోన్న అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశాయి అక్కడి దర్యాప్తు సంస్థలు. అలా తెలుగు, కన్నడ సినీపరిశ్రమలకు చెందిన ఓ ఐదుగురు నటీమణులు అక్రమంగా షికాగోలో ప్రవేశించి వ్యభిచారంలో చిక్కుకుపోయినట్టు అక్కడి దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తెలుగు సినీ పరిశ్రమలో మేనేజర్స్‌గా కొనసాగుతున్న ఓ దంపతుల ఇంట వీళ్లను షికాగోకు తరలించినట్టు అక్కడి అధికారుల దర్యాప్తులో తేలింది. అక్రమంగా అమెరికాలో నివసిస్తోన్న ఆ ఇద్దరు భార్యాభర్తల్ని హైదరాబాద్‌కి చెందిన కిషన్ మోడుగుమూడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి, చంద్రకళ పూర్ణిమ మోడుగుమూడి అలియాస్ జయం విభగా అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న వాషింగ్టన్‌లో ఆ జంటను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టారు. 

అమెరికాలోని ధనవంతులైన భారతీయ విటుల కోసం బాధితులను తీసుకెళ్లిన జంట: 
టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ఓ కథనం ప్రకారం 2017, మే 11 నుంచి 2018, జనవరి 22 వరకు వీళ్లిద్దరూ సెక్స్ రాకెట్ నేరాలకు పాల్పడ్డారని ఇల్లినాయిస్ కోర్టులో అక్కడి అంతర్గత భద్రత విభాగం అధికారులు దాఖలు చేసిన ఫిర్యాదులో  పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఎక్కడైనా హోటల్ రూమ్స్ బుక్ చేసి నటీమణులని అమెరికాకు పిలిపించుకునే ఈ జంట ఆ తర్వాత సందర్భాన్ని అనుసరించి వారికి ఆ హోటల్ గదుల్లో కానీ లేదా షికాగోలోని తమ ఇంట్లో కానీ బస ఏర్పాటు చేసే వారని ఈ కథనం పేర్కొంది. ఆ తర్వాత ఆ నటీమణులని అమెరికాలో జరిగే తెలుగు, భారతీయ సమావేశాలకు తీసుకెళ్లి అక్కడే వారిని ఎరగా చూపిస్తూ ధనవంతులైన విటులని గుర్తించడం ఈ దంపతుల వ్యాపారంలో ఓ భాగమని ఈ కథనం స్పష్టంచేసింది.

Trending News