Rishi Sunak Daughter: కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన రిషి సునాక్‌ కుమార్తె, వీడియో వైరల్

Rishi Sunak Daughter: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుమార్తె అనౌష్క సునాక్ కూచిపూడి డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 06:22 AM IST
  • యూకేలో డ్యాన్స్ ఫెస్టివల్
  • కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన రిషి సునాక్‌ కుమార్తె
  • ట్రెండ్ అవుతున్న వీడియో
Rishi Sunak Daughter: కూచిపూడి డ్యాన్స్ తో అదరగొట్టిన రిషి సునాక్‌ కుమార్తె, వీడియో వైరల్

Rishi Sunak Daughter Kuchipudi Dance: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)కు భారతీయ కళలు, సంస్కృతి పట్ల ఎంత మక్కువో మనందరికీ తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా ఆయన దేవాలయాలు సందర్శించడం, భారతీయ ఫెస్టివల్స్ ను ఘనంగా జరుపుకోవడం చేస్తూంటారు. అయితే తండ్రి బాటలోనే రిషి కుమార్తె అనౌష్క సునాక్ (9) భారతీయ కళల పట్ల ఆసక్తి చూపుతోంది. లండన్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. 

లండన్ నగరంలో '‘రాంగ్ - 2022'’ పేరుతో ఇంటర్నేషనల్‌ కూచిపూడి డాన్స్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి 100 మంది కళాకారులు పాల్గొన్నారు. వీరిలో కనిష్టంగా 4 ఏళ్ల నుంచి గరిష్టంగా 85 ఏళ్ల వయసు గల కళాకారులు ఈవెంట్ లో పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. ఇందులో పాల్గొన్న రిషి కుమార్తె అనౌష్క సునాక్‌ (Anoushka Sunak) మరికొందరు చిన్నారులతో కలిసి కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది. అనౌష్క సునాక్ తల్లి అక్షతా మూర్తి, రిషి సునాక్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ నృత్య ప్రదర్శనకు హాజరయ్యారు. 

యూకే ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్. అంతేకాకుండా అతి పిన్న వయస్కుడైన (42) బ్రిటిష్ ప్రధాన మంత్రి. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్‌ కు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్ధరి వివాహం 2009లో బెంగుళూరులో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కృష్ణ సునాక్‌, అనౌష్క సునాక్‌. 

Also Read: Rarest Blood Group: ప్రపంచంలో 45 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్.. బంగారం కంటే ధర ఎక్కువే..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News