భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

Last Updated : Sep 20, 2018, 06:20 PM IST
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. భారత్-పాకిస్తాన్ మధ్య చర్చలను పునరుద్దరించాలని ప్రధాని మోదీని ఈ లేఖ ద్వారా కోరిన ఇమ్రాన్ ఖాన్.. రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రుల మధ్య సైతం ఓ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య దూరం పెరగడానికి కారణమైన ఉగ్రవాదం అంశంపై చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేసినట్టు సమాచారం. పాక్ ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత భారత్‌తో పాక్ సంబంధాల గురించి స్పందిస్తూ.. భారత్ -పాక్ మధ్య ఎప్పటి నుంచో పక్కన పెట్టిన చర్చల అంశాన్ని మళ్లీ ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. 

అయితే, భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ భారతీయ జవాన్‌ని పాక్ బలగాలు అతి దారుణంగా హతమార్చిన మరుసటి రోజే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధానికి ఈ లేఖ రాయడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Trending News