America: ఇదెక్కడి ఘోరం... తొట్లె అనుకొని చిన్నారిని మైక్రో ఓవెన్ లో పెట్టిందంట మహాతల్లి.. ఎక్కడంటే..?

US Missouri News: యుఎస్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక తల్లి తన చిన్నారిని తొట్లె అనుకొని మైక్రోఓవెన్ లో పడుకొబెట్టింది. ఆ తర్వాత చాలా సేపు గమనించలేదంట. శుక్రవారం మధ్యాహ్నం మిస్సౌరీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 11, 2024, 07:40 PM IST
  • - చిన్నారిని మైక్రో ఓవెన్ లో పెట్టిన తల్లి..
    - వెలుగులోకి వచ్చిన షాకింగ్ ఘటన..
America: ఇదెక్కడి ఘోరం... తొట్లె అనుకొని చిన్నారిని మైక్రో ఓవెన్ లో పెట్టిందంట మహాతల్లి.. ఎక్కడంటే..?

Mother Mistakenly Puts Her Child In Crib: మనలో చాలా మంది చిన్న పిల్లలను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ముఖ్యంగా కొత్త జంట పెళ్లైనజంటలు కొందరు మాత్రం.. తొందరగా పిల్లలకోసం ప్లాన్ లు చేసుకుంటారు. లైఫ్ లో తక్కువ సమయంలోనే పిల్లలను కంటే తొందరగా పెరుగుతారని భావిస్తారు. కానీ ఇంకొందరు మాత్రం.. పెళ్లి కాగానే లైఫ్ లోసెటిల్ కావాలని అప్పుడే పిల్లలను కనడంను వాయిదా వేస్తుంటారు. పెళ్లాయ్యాక... కొందరు ఆరోగ్య సమస్యల వల్ల డాక్టర్ల చుట్టు తిరుగుతారు. గుళ్లు గోపూరాలకు కూడా తిరిగే వారుంటారు.

Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!

కానీ కొందరు తల్లులు మాత్రం తమ పిల్లల పట్ల ఇష్టమున్నట్లు వ్యవహరిస్తారు. ఇంట్లో ఆడుకుంటున్న లేదా వంటలు చేసేటప్పుడు పూర్తిగా అజాగ్రత్తగా ఉంటారు. దీంతో పిల్లలు నీళ్ల సంపులో పడిపోవడం, ఆడుకుంటు వస్తువులను మింగేయడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఇంకొందరు తల్లులు మాత్రం మరీ ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. తొమ్మిది నెలలు మోసి కన్న తల్లి ఇంత అజాగ్రత్తగా ఉంటారంటే మనకే ఆశ్చర్యం  వేస్తుంటుంది. అచ్చం ఇలాంటి షాకింగ్ కు గురిచేసే సంఘటన ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాలు.. 

అమెరికాలో ఈ విషాదకర ఘటన జరిగింది. గత శుక్రవారం మిస్సౌరీలో మరియా థామస్ ఇటీవల డెలీవరి అయ్యింది. చిన్నారిని దంపతులు ఎంతో బాగాచూసుకునేవారు. ఈ క్రమంలో చూస్తునే చిన్నారి పుట్టి నెలరోజులు అయ్యింది. పోలీసుల ప్రకారం.. గత శుక్రవారం.. నాడు థామస్.. తొట్లెలో తన బిడ్డను పడుకొబెట్టాలని చూసింది. కానీ ఆమె అజాగ్రత్తగా చేసిందో , ఏ లోకంలో ఉందో కానీ.. చిన్నారిని ఏకంగా  మైక్రో ఓవెన్ పడుకొబెట్టింది. అప్పటికే అది బాగా హీట్ గా ఉంది.

అంతే కాకుండా.. చిన్నారి డైపర్, బ్లాంకెట్ పూర్తిగా కాలిపోయి ఏదో వాసన రావడంతో మరియా థామస్ గమనించింది. వెంటనే తన చిన్నారిని బైటకు తీసి ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే చిన్నారిలో ఉలుకు,పలుకులేదు. వీపు వెనక భాగం పూర్తిగా కాలిపోయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారి మరణించిందని తెలిపారు. దీంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.

Read More: Mouni Roy: 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్ కొత్త అవతారం.. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా..

స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు మరియా థామస్ ను అదుపులోకి తీసుకున్నారు. డెయిలీ ఎక్స్‌ప్రెస్ US ప్రకారం, థామస్ ఇంటిలో పొగ వాసన వస్తోందని, పిల్లల బట్టలు నల్లబడి, ఆమె డైపర్‌లో కాల్చివేయబడినట్లు పోలీసులు గుర్తించారు. పసిపాపం అకాల మరణానికి కారణమైందన్న ఆరోపణలతో మరియా  థామస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కావాలని చేసిందా.. అనుకోకుండా జరిగిందా.. అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. అదే విధంగా.. చిన్నారి తల్లి మానసిక స్థితి బాగుందా..  అన్నదానిపై కూడా మానసిక నిపుణులతో విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం యూఎస్ లో తీవ్ర సంచలనంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News