Theatres Close: సినీ పరిశ్రమకు థియేటర్ల షాక్‌.. తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Theatres Close 10 Days In Telangana: సినీ పరిశ్రమలో కలకలం రేగింది. సినిమాలు విడుదల కాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు సినీ పరిశ్రమకు ఝలక్‌ ఇచ్చాయి. 10 రోజుల పాటు థియేటర్లు బంద్‌ చేస్తున్నట్లు తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా హాళ్లకు ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో బంద్‌కు నిర్ణయించారు.

  • Zee Media Bureau
  • May 15, 2024, 04:39 PM IST

Video ThumbnailPlay icon

Trending News