YS Sharmila: కేసీఆర్ పేరు మార్చుకున్నారు.. కొత్త పేరు ఏంటంటే.. వైఎస్ షర్మిల సెటైర్లు

YS Sharmila On CM KCR: సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతు బాగుపడడనని.. రైతుకు శాపమేనని అన్నారు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అవ్వదన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 22, 2023, 04:18 PM IST
YS Sharmila: కేసీఆర్ పేరు మార్చుకున్నారు.. కొత్త పేరు ఏంటంటే.. వైఎస్ షర్మిల సెటైర్లు

YS Sharmila On CM KCR: షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కోసం అఖిలపక్షం చేస్తున్న మహా ధర్నాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరులో వైఎస్సార్ పాదయాత్ర చేసి.. ఇక్కడ వలసలు చూసి కరువు చూసి చలించి పోయారని అన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులు కట్టి లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతి అని.. ఉచిత విద్యుత్ ఇచ్చి.. విద్యుత్ బకాయిలు మాఫీ చేశారని అన్నారు. 

"వైఎస్ఆర్ ఇదే పాలమూరు జిల్లాలో ప్రతి ఏకరాకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేది. మనస్పూర్తిగా చేయాలని అనుకున్నాడు. ఆనాడే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ బీజం పడింది. వైఎస్సార్ ఎంతో తపన పడ్డాడు. జూరాల నుంచి వరద నీటిని ఎత్తిపొసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నాడు. వైఎస్ఆర్‌ ప్లానింగ్ ప్రకారం జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉంటే లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ మొదటి పాయింట్ అయ్యేది. ఇక్కడ నుంచే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందేది.

20 టీఎంసీ నీళ్లను స్టోరేజ్ చేయాలని అనుకున్నారు. కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు ప్రాజెక్ట్‌ను రీ డిజైన్ చేశాడు. రీ డిజైన్ చేసి లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్ట్‌ను చివరి పాయింట్ చేశాడు. రీ డిజైన్ చేసినా.. ఈ రిజర్వాయర్‌కు తట్టెడు మట్టి మోయలేదు. అసలు పాలమూరు ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చింది లేదు. ప్రాజెక్ట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పాలమూరు ప్రాజెక్ట్‌ను 48 నెలల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాడు. ఇప్పుడు 8 ఏళ్లు దాటినా.. ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇప్పుడు అనుమతులు లేవట. 32 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు 22 వేల కోట్లు ఖర్చు చేశాడు.

అనుమతులు లేవని చెప్పిన ప్రాజెక్ట్ కి ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారు. 90 టీఎంసీల ప్రాజెక్ట్‌ను 9 టీఎంసీలకు కుదించారు. సాగునీటి ప్రాజెక్ట్‌ను తాగునీటి కుదించారు. కోర్ట్ ముట్టికాయలు వేసిందని  అబద్ధాలు చెప్తున్నారు. మోసాలు చేస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రైతు బాగుపడడు. రైతుకు శాపమే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు. ఈ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు. అందుకే కేసీఆర్‌ను సాగనంపాలి.." అని షర్మిల అన్నారు.

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కోసం కేసీఆర్ ఎన్నో అబద్ధాలు చెప్పాడని ఫైర్ అయ్యారు. ఓట్లు వేయించుకొని మోసం చేశాడు తప్పితే.. ఈ రిజర్వాయర్ పనులు ప్రారంభం  కాలేదన్నారు. కేసీఆర్‌కి బుద్ది చెప్పాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేరు మార్చుకున్నారని.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కాస్త కమీషన్ల చంద్రశేఖర్ రావు అయ్యాడని సెటైర్లు వేశారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నాడని విమర్శించారు. ఒకప్పుడు కేసీఆర్ డొక్కు స్కూటర్‌లో తిరిగేవాడని.. ఇప్పుడు లక్షల కోట్లు వెనకేశాడని ఆరోపించారు.

Also Read: IPL 2023 Playoffs: ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు.. ఎవరితో ఎవరు ఢీ అంటే..?  

Also Read: Bandi Sanjay Speech: కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి: బండి సంజయ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News