హైదరాబాద్ 'నిర్భయ' కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామం నుండి విధులు ముగించుకొని శంషాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న ఓ పశు వైద్యాధికారిణి పశువాంఛ కలిగిన నలుగురు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు మహిళలకు ఎంతమేరకు రక్షణ ఉందనే ప్రశ్నను మరోసారి ఉత్పన్నమయ్యేలా చేసింది. 

Last Updated : Nov 30, 2019, 02:53 PM IST
హైదరాబాద్ 'నిర్భయ' కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూర్ గ్రామం నుండి విధులు ముగించుకొని శంషాబాద్‌లోని తన నివాసానికి తిరిగి వస్తున్న ఓ పశు వైద్యాధికారిణి పశువాంఛ కలిగిన నలుగురు కిరాతకుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆడపిల్లలు, మహిళలకు ఎంతమేరకు రక్షణ ఉందనే ప్రశ్నను మరోసారి ఉత్పన్నమయ్యేలా చేసింది. కూతురు దారుణ హత్యకు గురైందన్న మరణ వార్త విని తండ్రి శ్రీధర్ రెడ్డి, తల్లి, చెల్లి భవ్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌లో బాధితురాలి కుటుంబం ఉంటున్న నివాసానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్.. ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నిందితులకు కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Trending News