Munugode Result Live Updates: మునుగోడులో టీఆర్ఎస్ జెండా.. 10,297 ఓట్లతో కూసుకుంట్ల విన్

Telangana Bypoll Elections Result 2022: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా..  225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Last Updated : Nov 6, 2022, 06:01 PM IST
Munugode Result Live Updates: మునుగోడులో టీఆర్ఎస్ జెండా.. 10,297 ఓట్లతో కూసుకుంట్ల విన్
Live Blog

Telangana Bypoll Elections Result 2022 Live Update: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగుతోంది. రౌండ్ రౌండ్ కు లీడులు మారిపోతున్నాయి. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా..  225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు జరగనుంది. చివరగా గట్టుపల్ల్ మండలం ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల ఓట్లను కౌంట్ చేస్తారు.

6 November, 2022

  • 17:57 PM

    మునుగోడులో టీఆర్ఎస్ విజయం

    10297 ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు

    టీఆర్ఎస్ 97006
    బీజేపీ      86,697
    కాంగ్రెస్    23,906

  • 15:59 PM

    12వ రౌండ్ లో టీఆర్ఎస్ 7440

    బిజేపి 5398

    12వ రౌండ్ లో టీఆరెఎస్ లీడ్ 2042

    12 రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 7836

  • 15:22 PM

    11వ రౌండ్ లో టీఆర్ఎస్ 7235

    బిజేపి 5877

    టీఆరెఎస్ లీడ్ 1358.

    11 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 5774

  • 15:00 PM

    10వ రౌండ్ లో....

    తెరాసా 7499,
    బిజేపి 7015,
    కాంగ్రెస్ రాలేదు.

    టీఆరెఎస్ లీడ్ 484.

    10 రౌండ్లు ముగిసే సరికి టీఆరెఎస్ లీడ్ 4416 ఓట్ల లీడ్

  • 13:00 PM

    1st round
    TRS- 6317
    BJP- 5127

    Lead by TRS- 1190

     2nd round:
    TRS- 7781
    BJP- 8623

    Total Lead by TRS : 348

     3rd round:
    TRS- 7387
    BJP- 7426

    Total Lead by TRS- 309

     4rd round:
    TRS- 4855
    BJP- 4560

    Total Lead by TRS- 608

     5rd round:
    TRS- 6062
    BJP- 5245

    Total Lead by TRS- 1426

    6rd round
    TRS- 6016
    BJP- 5378

    Total Lead by TRS- 2064
    Postal Lead - 194
    Total lead Trs 2258

  • 12:38 PM

    ఆరవ రౌండ్ లో  టీఆర్ఎస్  6016

    బిజేపి 5378

    ఆరవ రౌండ్ లో టీఆరెఎస్ లీడ్ 638

    అరు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ మొత్తం లీడ్ 2169

  • 12:11 PM

    మునుగోడు కౌంటింగ్ లో ఎవరికి అందకుండా ఫలితాలు వస్తున్నాయి. బీజేపీ బలహీనంగా ఉందని భావించిన సంస్థాన్ నారాయణపురంలో మండలంలో ఆ పార్టీకి గణనీయంగా ఓట్లు వచ్చాయి. నారాయణపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. దీంతో ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటు ఉంటుందని, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందనే ప్రచారం సాగింది. కాని అనూహ్యాంగా సంస్థాన్ నారాయణపురం మండలంలో బీజేపీకి ఓట్లు వచ్చాయి. ఈ మండలంలో తమకు నాలుగు నుంచి ఐదు వేల మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ అంచనావేసుకోగా.. కౌంటింగ్ లో మాత్రం కేవలం వెయ్యి ఓట్ల లీడ్ మాత్రమే వచ్చింది.

  • 11:23 AM

    మునుగోడు  కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు.....

     ఎన్నిక కౌంటర్ సెంటర్లో ధర్నాకు దిగిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా రిపోర్టర్లు...

     రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్

    రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం

    ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

    కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేసిన సీఈవో

    మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్

     

  • 10:59 AM

    నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ లీడ్ 714

    TRS      26443
    BJP       25729
    CONG   7380

     

  • 10:15 AM

    మునుగోడు ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు లీడ్ లు మారిపోతున్నాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం రాగా.. రెండు, మూడు, నాలుగు రౌండ్లలో బీజేపీకి లీడ్ వచ్చింది. మొదటి నాలుగు రౌండ్ల ఓట్లు చౌటుప్పల్ మండలానికి సంబంధించినవి. చౌటుప్పల్ మండలంలో ఓవరాల్ గా బీజేపీ లీడ్ సాధించింది. మొత్తం నాలుగు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు ఏడు వందల ఓట్లకు పైగా మెజార్టీతో ఉన్నారు.

    చౌటుప్పల్ మండలానికి సంబంధించి అధికార పార్టీ కీలక నేతలకు షాక్ తగిలింది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంచార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జుగా ఉన్న లింగోజిగూడెంలో బీజేపీకి దాదాపు రెండు వందల ఓట్ల లీడ్ వచ్చింది. మల్లారెడ్డి  ఇంచార్జ్ గా ఉన్న ఆరెగూడెం, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంచార్జుగా ఉన్న దేవలమ్మ నాగారంలో కమలం పార్టీకి ఓటర్లు జై కొట్టారు.

  • 09:56 AM

    మూడు రౌెండ్లు పూర్తయ్యే సరికి 314 ఓట్ల లీడ్ లో టీఆర్ఎస్
    TRS 21489
    BJP 21175
    INC  5718

     

  • 09:44 AM

    మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు షాక్

    మంత్రి ఇంచార్జ్ గా ఉన్న లింగోజి గూడెంలో బీజేపీకీ లీడ్

    లింగోజీగూడంలో

    టిఆర్ఎస్ :-292
    బీజేపీ 460,
    కాంగ్రెస్ :-74
    బిఎస్పి :-8
    డి.ఎస్.పి 2

     

  • 09:30 AM

    టిఆర్ఎస్ : 14,211
    బీజేపీ : 13648
    కాంగ్రెస్ :3597

    రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యం

  • 09:09 AM

    తొలి రౌండ్ లో టీఆర్ఎస్ 6478
    బీజేపి 5126 

    కాంగ్రెస్ 2100.

     టీఆర్ఎస్ లీడ్ 1352

  • 08:56 AM

    తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు భారీ లీడ్

    1192 ఓట్ల ఆధిక్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  • 08:42 AM

    పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ కు లీడ్ వచ్చింది.

    టీఆర్ఎస్ కు 228 ఓట్లు రాగా.. 224 ఓట్లు బీజేపీకి వచ్చాయి

    నాలుగు ఓట్ల లీడ్ సాధించింది బీజేపీ

  • 07:45 AM

    ఒక్కో రౌండ్ లో 21 బూత్ ల ఓట్ల లెక్కింపు

    మొదటి మూడు రౌండ్లు చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు

    చౌటుప్పల్ లో మొత్తం పోలింగ్ బూత్ ల సంఖ్య 68

    తర్వాత నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు

    నారాయణ పురం మండలంలో మొత్తం బూత్ లు 54

    నారాయణ పురం మండలం ఓట్లు కూడా మూడు రౌండ్ల పాటు లెక్కింపు

    మొత్తం యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్, నారాయణ పురం కలిపి 122 పోలింగ్ బూత్ లు

    నారాయణ పురం తర్వాత మునుగోడు ఓట్ల లెక్కింపు

    మునుగోడులో మొత్తం 44 బూత్ లు

    మునుగోడు మండలంలో రెండు రౌండ్ల పాటు సాగనున్న లెక్కింపు

    చండూరులో మొత్తం బూత్ లు 40

    ఇక్కడ కూడా రెండు రౌండ్ల పాటు లెక్కింపు

    మర్రిగూడ (33), నాంపల్లి(43), గట్టుపల్(16) మండలాల్లో మొత్తం బూత్ లు సంఖ్య 92

    ఈ మూడు మండలాల్లో కలిపి ఐదు‌ రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు

    మధ్యాహ్నం 1 గంటల వరకు తేలనున్న ఫలితం

Trending News