Kavitha: కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్ రావు.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం

KT Rama Rao Harish Rao Meets To Kavitha: అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో కవితను కేటీఆర్‌, హరీశ్ రావు ఇతర ముఖ్యులు కలిసి చర్చించారు. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2024, 08:06 PM IST
Kavitha: కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్ రావు.. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధం

Kavitha Updates: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అకస్మాత్తుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత అరెస్ట్‌ వ్యవహారాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ తేలికగా తీసుకోవడం లేదు. కవిత అరెస్ట్‌పై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆమె సోదరుడు కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌ రావు, కవిత భర్త అనిల్‌ కుమార్‌, న్యాయవాది మోహిత్‌ రావు పరిశీలించారు. సందర్శన సమయంలో కవితను వారు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కవితను కుశల ప్రశ్నలు అడగడంతోపాటు తదుపరి ఏం చేయాలనే అంశంపై చర్చించారు.

Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్‌ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?

 

హైదరాబాద్‌లో కవిత అరెస్టయిన రెండు రోజులకు కేటీఆర్‌, హరీశ్ రావు ప్రత్యేకంగా న్యూఢిల్లీకి వెళ్లారు. ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌లో కస్టడీ ఉన్న కవితను ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కలిశారు. కుటుంబసభ్యులతో సమావేశం, ఇంటి భోజనానికి ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితతో కేటీఆర్‌, హరీశ్ రావు, అనిల్‌ మాట్లాడారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కవితతో కూలంకషంగా మాట్లాడారు. కవితతో మాట్లాడిన అంశాలు తండ్రి, పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: KTR: ప్రియమైన చెల్లెలు కవిత అరెస్ట్‌పై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. ఏమన్నారంటే?

 

కవితతో భేటీ అనంతరం వారు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. న్యాయ పోరాటం ఎలా చేద్దామని చర్చించారు. అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులకు సూచించారు. ఢిల్లీ మద్యం కేసుపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేయనున్నారు. దీనికితోడు ఒక మహిళను సాయంత్రం పూట అరెస్ట్‌ చేయడాన్ని కూడా కోర్టులో ప్రశ్నించనున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా.. రాజకీయ కక్షపూరితంగా కవితను అరెస్ట్‌ చేశారని మొదటి నుంచి కేటీఆర్‌, హరీశ్ రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు పని దినం కావడంతో న్యాయ పోరాటానికి కేటీఆర్‌, హరీశ్ రావు సిద్ధమయ్యారు. కాగా, కవితకు ఈనెల 23వ తేదీ వరకు కోర్టు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News