Weather Report: బి అలర్ట్.. మరో రెండు రోజులు ఈ జిల్లాల్లో వడగళ్ల వాన

ఎప్పుడు లేని విధంగా ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కొంత మంది వేడి నుండి ఉపశమనం పొందుతుంటే.. వడగండ్ల వాన వలన రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజులు తెలంగాణకు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 04:33 PM IST
Weather Report: బి అలర్ట్.. మరో రెండు రోజులు ఈ జిల్లాల్లో వడగళ్ల వాన

Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లేని విధంగా ఏప్రిల్ నెలలో భారీ వర్షపాతం నమోదు అవుతుంది. మండే వేసవిలో గత మూడు నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడి ఉండటంతో జనాలు ఉక్కపోత నుండి ఉపశమనం పొందుతున్నారు. ఇదే సమయంలో కొందరు వడగళ్ల వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సైజ్ నుండి క్రికెట్ బాల్‌ సైజ్ లో వడగళ్లు పడుతుండటంతో రైతులు మరియు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో మొత్తం వాతావరణం చల్లగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో సగటున 7 నుండి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలియజేశారు.

విదర్భ పశ్చిమ ప్రాంతం నుండి కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడినట్లుగా అధికారులు తెలియజేశారు. దక్షిణ మరియు ఆగ్నేయ భారతం నుండి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. అందువల్ల పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్‌ ను ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ లో మొన్న రాత్రి కురిసిన వర్షంతో రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. ఇప్పుడిప్పుడే రోడ్లు అన్నీ కూడా క్లీయర్ అవుతున్నాయి. ఈ సమయంలో మళ్లీ కూడా హైదరాబాద్‌ లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉంది అంటూ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. నేడు గురువారం ఉదయం కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. రేపటి వరకు కూడా ఈ తరహాలోనే వర్షపాతం నమోదు అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి.. వికారాబాద్‌ లో 9 సెంటీమీటర్ల, భువనగిరిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. వర్షాల కారణంగా రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.. ఉక్క పోత నుండి కాస్త రిలాక్స్ అయ్యింది. మరో రెండు లేదా మూడు రోజుల తర్వాత మళ్లీ ఎండలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read: Revanth Reddy Govt Jobs: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు: రేవంత్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News