Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలు

Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలకు వర్షాలు ఊరటనిచ్చాయి. ఇదే పరిస్థితి తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2024, 07:35 AM IST
Telangana Weather Report: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఈ నెల 15 వరకూ భారీ వర్షాలు

Telangana Weather Report: ఎండాకాలంలో ఎండలు పీక్స్‌కు చేరి వడగాల్పులతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎండలతో ఠారెత్తిన జనాన్ని ఉపశమనం కలిగింది. మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాతావరణం చల్లబడింది. రానున్న నాలుగు రోజులు కూడా తెలంగాణలో వర్షాలుంటాయని ఐఎండీ వెల్లడించింది. 

తెలంగాణలో రానున్న 4 రోజులు వాతావరణం ఎంలా ఉంటుంది. ఎక్కడెక్కడ గత నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉందనే వివరాలు వాతావరణ శాఖ వివరించింది. రాష్ట్రంలో ఇప్పుడు వాతావరణం చల్లబడినా ఏప్రిల్ నెలంతా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోయారు. గత 3 రోజుల్నించి వాతావరణం మారింది. మహారాష్ట్ర, విదర్బ ప్రాంతాల మీదుగా దక్షిణ కర్ణాటక నుంచి విస్తరించిన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 

మే 10 శుక్రవారం తెలంగాణలో వర్షపాతం వివరాలు

నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా శంకరంపేటలో 4.7 సెంటీమీర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 3.8 సెంటీమీటర్లు కురిసింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంకారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదైంది. 

మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నిజామాబాద్‌లో పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇదే జిల్లాలోని జకోరాలో 43.6 డిగ్రీలు నమోదైంది. ఇక రానున్న నాలుగు రోజులు అంటే ఈ నెల 15 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. 

Also read: Narendra Modi: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. గ్యారంటీకి తోడు నిలవండి: నరేంద్ర మోదీ

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News