CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Telangana mp polls 2024: కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రత్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ అని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత వరక ఇతలకు అవకాశం ఇవ్వడంటూకూడా సెటైర్ లు వేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : May 10, 2024, 03:03 PM IST
  • కేటీఆర్ టిష్యూపేపర్ లాంటి వాడు..
  • మరోసారి సెటైర్ వేసిన రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy: కేటీఆర్ ఒక ఉడుతలు పట్టేవాడు.. మరోసారి పంచ్ లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Cm Revanth Reddy hot comments on brs leader ktr: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటలు ఉన్న నేపథ్యంలో నాయకులు కాళ్లకు రాకెట్లు కట్టుకుని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కువగా బహిరంగా సమావేశాలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి, గల్లీ గల్లీకి తిరుగుతూ తమకు అనుకూలంగా ఓటు వేయాలంటూ కూడా ఎన్నికలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలుతో పీక్స్ కు చేరింది. నాయకులు ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ.. మాజీ సీఎం రేవంత్ పదేళ్ల పాటు తెలంగాణను అన్నిరంగాలలో వెనుకబడేలా చేశారంటూ ఎద్దేవా చేశారు. నీళ్లు,నిధులు, నియమాకాల మీద ఆవిర్భవించిన పార్టీ కేవలం, తమ ఇంట్లో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నారన్నారు. నోటిఫికేషన్లు లేకుండా నిరుద్యోగులను నిండా ముంచారన్నారు.

Read More: MP Navneet Kaur Rana: బిడ్డా 15 సెకన్లు చాలు.. ఒవైసీ బ్రదర్స్ కు స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చిన నవనీత్ కౌర్.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలతో వేల కోట్లు అడ్డంగా దోచుకున్నారంటూ విమర్శలు గుర్పించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సీఎం రేవంత్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బీఆర్ఎస్ కేటీఆర్ ఒక టిష్యూ పేపర్ లాంటి వాడంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ నత్తింగ్ బట్ తెలంగాణ పాలిటిక్స్ అంటూ తీసి పడేశారు. ఇప్పటికైతే తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని, భవిష్యత్తులో ఎవరుంటారో వాళ్లు ఉంటారన్నారు. అదే విధంగా..కేసీఆర్ ఉన్నంత వరకు కేటీఆర్, హరీష్ రావులకు అవకాశం ఇవ్వడంటూ కూడా సెటైర్ లు వేశారు.

కేటీఆర్ టిష్యూ పేపర్ లాంటి వాడని, ఉడుతలు పట్టేవాడంటూ కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలుచేశారు. ఇదిలా ఉండగా.. ఇటు బీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలు నువ్వేంత అంటే నువ్వేంత అనే విధంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదునెలలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, రైతులకు రైతుబంధు, రుణమాపీ పథకాలను ఇంకా అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది.

Read More: Madhya Pradesh : ఎన్నికల వేళ తీవ్ర దుమారం..బాలుడితో ఓటువేయించిన బీజేపీనేత.. వైరల్ వీడియో..

మరోవైపు..పథకాలు రాలేదంటూ కాంగ్రెస్ మంత్రులు నోటికొచ్చినట్లూ దూశిస్తున్నారంటూ, కేసీఆర్ ను తిట్టుడే వాళ్లపనిలాగా మారిందన్నారు. పాలన చాతకాక, కాంగ్రెస్ వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News