KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్

KTR Comments On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేమి లేదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 16, 2024, 05:12 PM IST
KTR: రేవంత్ రెడ్డిది తప్పులేదు.. ముందు చెప్పినట్లే చేశాడు: కేటీఆర్

KTR Comments On Revanth Reddy: మంత్రి పదవులు అనుభంచిన వారు సైతం పార్టీని విడుతున్నా.. గిరిజన బిడ్డ సక్కుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకున్నా.. పార్టీని పట్టుకొని ఉన్నందుకే కేసీఆర్ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు రుణ మాఫీ చేయని కాంగ్రెస్ నేతలు ప్రచారానికి వస్తే  చెప్పులతో కొట్టాలన్నారు. రేవంత్ రెడ్డిది తప్పు లేదని.. 'ఎన్నికల ముందు చెప్పిండు.. ప్రజలను మోసం చేస్తేనే అధికారం వస్తుందన్నాడు అట్లనే చేసిండు..' అన్నారు. అమలుకు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు అని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకుంటారని అన్నారు. టెట్ ఫీజు పెంచారని.. మెగా డీఎస్సీ  ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు.

Also Read: Sri Rama Navami 2024: ఒంటిమిట్ట‌ రాములోరి కల్యాణం చూతము రారండి .. బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ ఇదే..

ఉద్యోగులకు జీతాలు పెంచినా.. కానీ కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల  సమయానికి ఇవ్వలేకపోయామన్నా కేటీఆర్. రాహుల్ గాంధీ మోదీని చోర్ అంటున్నాడని, కానీ మోదీ తమ పెద్దన్న అని రేవంత్ అంటున్నాడని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు జరుగుతాయని.. రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతాడని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషా..? బీజేపీ మనిషా అర్థం కావడం లేదన్నారు. లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ గాంధీ అంటున్నాడని.. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కవిత లిక్కర్ స్కామ్‌లో ఉందని అంటున్నారని అన్నారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని.. రిజర్వేషన్లు తీసివేస్తామని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు."రాముడు అందరికి దేవుడు. రాముని మొక్కుతాం.. బీజేపీని తొక్కుతాం.. ఉత్తరాదిలో జనాభా పెరిగింది.. దక్షిణాదిలో జనాభా  తగ్గింది. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. నాయకులు పదవుల కోసం పైరవీల కోసం పార్టీని వీడుతున్నారు. కానీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. పూర్వవైభవం మళ్లీ వస్తుంది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి లక్షణాలు లేవు. ప్రభుత్వాన్ని కులగొట్టే తొందర మాకు లేదు. 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండండి. తెలంగాణ ఉద్యమంలో లేనివారు వచ్చి పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్లిపోతున్నారు.." అని కేటీఆర్ అన్నారు.

Also Read: Beheading Case: 27 ఏళ్ల కేసుకు తెర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి 18 నెలల జైలు శిక్ష,

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News