Yuvraj Singh Six Sixes: యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ

On This Day in 2007 Yuvraj Singh smashes Six Sixes in Stuart Broad Bowling. 15 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 19, 2022, 12:17 PM IST
  • యువరాజ్ సింగ్ పెను విధ్వంసం
  • 6 బంతుల్లో 6 సిక్సులు
  • 12 బంతుల్లో హాఫ్ సెంచరీ
Yuvraj Singh Six Sixes: యువరాజ్ సింగ్ పెను విధ్వంసం.. 6 బంతుల్లో 6 సిక్సులు! 12 బంతుల్లో హాఫ్ సెంచరీ

Yuvraj Singh hits 6 Sixes in Stuart Broad Bowling at 2007 T20I World Cup: యువరాజ్ సింగ్.. సగటు క్రికెట్ అభిమానికి పరిచయం అక్కరలేని పేరు. టీ20 ప్రపంచకప్‌ 2007, వన్డే ప్రపంచకప్‌ 2011 భారత జట్టు సాధించడంలో క్రియాశీల పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో సత్తాచాటి అసలైన ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ 2007లో యువీ 6 బంతుల్లో 6 సిక్సులు బాదిన జ్ఞాపకాలను ఏ భారతీయ అభిమాని మర్చిపోడు. ఒకే ఓవర్లో 36 రన్స్ పిండుకుని తన హిట్టింగ్‌ విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపాడు. 15 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) యువరాజ్ పెను విధ్వంసం సృష్టించాడు. 

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 2007 సెప్టెంబర్ ‌19వ తేదీన డర్బన్ వేదికగా ఇంగ్లండ్, భారత్  జట్లుతలపడ్డాయి. టీమిండియాకు అది తప్పక గెలవాల్సిన మ్యాచ్. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ క్రీజులో ఉన్నారు. అప్పటికి భారత్ స్కోర్ 18 ఓవర్లలో మూడు వికెట్లకు 171. ఈ సమయంలో ఇంగ్లండ్ ప్లేయర్ ఆండ్రూ ఫ్లింటాప్‌.. యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువరాజ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. అంతేకాదు 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (68), గౌతం గంభీర్ (58) మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. ఆపై 19 పరుగుల వ్యవధిలో ఓపెనర్లతో పాటు రాబిన్‌ ఊతప్ప (6) ఔట్ అయ్యాడు. ఎంఎస్ ధోనీ (10), యువరాజ్ సింగ్ ‌(58: 16 బంతుల్లో 3x4, 7x6) క్రీజులోకి వచ్చారు. 18వ ఓవర్ వేసిన ఆండ్రూ ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ వరుసగా రెండు బౌండరీలు (4, 4) బాదాడు. దీంతో యువీపై ప్లింటాఫ్ స్లెడ్జింగ్ చిహ్సాడు . దాంతో మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ కోపాన్ని యువరాజ్ తర్వాత ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో చూపించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదాడు.

టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు. చివరి ఓవర్ వేసేందుకు బౌలింగ్‌కి వచ్చిన ప్లింటాఫ్‌.. ఓ సిక్స్‌ బాదిన అనంతరం యువీని ఔట్ చేశాడు. చివరి మూడు ఓవర్లలో ఎంఎస్ ధోనీ, యువరాజ్ కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. యువీ మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 200 పరుగులు చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

Also Read: God Father Release: సల్మాన్ ఖాన్ దెబ్బకు దిగొచ్చిన గాడ్ ఫాదర్ టీం..అంతా సెట్!

Also Read: Team India: కేఎల్ రాహుల్‌ను తక్కువ అంచనా వేయొద్దు..టీమిండియా మాజీ ఓపెనర్ కీలక వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News