Chiranjeevi: మెగాస్టార్ కు జెర్సీ కానుకగా ఇచ్చిన కేఎస్‌ భరత్‌.. ఎందుకో తెలుసా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన నేపథ్యంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. తన జెర్సీని గిఫ్ట్ గా అందజేశాడు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 08:27 AM IST
Chiranjeevi: మెగాస్టార్ కు జెర్సీ కానుకగా ఇచ్చిన కేఎస్‌ భరత్‌.. ఎందుకో తెలుసా?

KS Bharat Meets Chiranjeevi: దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ మెగాస్టార్ చిరంజీవిని వరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. సోమవారం మెగాస్టార్ ఇంటికి వెళ్లిన భరత్.. తన జెర్సీని అందించి ధన్యవాదాలు చెప్పాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే మెగాస్టార్‌ విషెస్ చెప్పిన వారిలో దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సందీప్‌ రెడ్డి వంగా, వశిష్ఠ, మారుతి, శ్రీకాంత్‌ ఓదెల నిర్మాతలు దిల్‌ రాజు, ఎస్‌.రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. 

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రానికి బింబిసార ఫేమ్‌ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీకి అస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఛోటా కె నాయుడు ఛాయాగ్రహకుడిగా పనిచేస్తున్నాడు. ఇది మూడు లోకాలు చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. 

Also Read: Payal Rajput: ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన 'మంగళవారం' .. ఏకంగా నాలుగు అవార్డులు సొంతం

త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనుష్క, మృణాల్‌ ఠాకూర్‌ను ఇప్పటికే ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా  ఈ సినిమా షూటింగ్ కు వెళ్లకుండానే ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తోంది. 16 కోట్లకు సరిగమ వారు కొనుగోలు చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విశ్వంభర చిత్రం రాబోతున్నట్లు ఇది వరకే మూవీటీమ్ వెల్లడించింది. 

Also Read: Salaar - Prabhas: సలార్ 2 షూటింగ్ పై క్రేజీ అప్‌డేట్.. రిలీజ్ డేట్ అపుడేనా.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News