T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దుబే.. ఇందులో నిజమెంత?

T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసే పనిలో పడింది భారత్.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 16, 2024, 09:17 PM IST
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్ పాండ్యా స్థానంలో శివమ్ దుబే.. ఇందులో నిజమెంత?

India's T20 World Cup Squad Selection: వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి టీమ్ ను ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. ఈ నెల చివరిలో గానీ లేదా మే మెుదటి వారంలో గానీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టు కూర్పు గురించి చర్చించడానికి రోహిత్ శర్మ ఇటీవల ముంబైలో టీం ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు సెలెక్టర్ చీఫ్ అజిత్ అగార్కర్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, గత వారం బీసీసీఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ కు అతడిని తప్పించనున్నట్లు తెలుస్తోంది. 

ఘోరంగా విఫలమవుతున్న పాండ్యా..
మరోవైపు ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాండ్యా అటు సారథిగా, ఫ్లేయర్ గా కూడా విఫలమవుతున్నాడు.  అతడు ఆరు మ్యాచుల్లో 11 ఓవర్లు వేసి మూడు వికెట్లు మాత్రమే తీశాడు.  బ్యాటింగ్ లో అయితే పూర్తి నిరాశపరిచాడు. ఆరు ఇన్నింగ్స్ లో కేవలం 131 పరుగులు మాత్రమే చేశాడు. పవర్-ప్యాక్డ్ హిట్టింగ్ కు మారుపేరైన పాండ్యా ఈ ఐపీఎల్ ముగిసే లోపు ఫామ్ లోకి వస్తాడని జట్టు టీమిండియా జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసేందుకు భారత సెలక్షన్ కమిటీ ఈ నెలాఖరులో సమావేశమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో బాగా ఫ్లేయర్స్ కు వరల్డ్ కప్ లో చోటు దక్కే అవకాశం ఉంది. 

Also Read: Mahesh Bhupathi: 'ఆర్సీబీని అమ్మేయండి..'.. భారత టెన్నిస్ దిగ్గ‌జం సంచలన వ్యాఖ్యలు..

హార్దిక్ వర్సెస్ దుబే
మరోవైపు ఐపీఎల్ దుమ్మురేపుతున్న చెన్నై ఆల్ రౌండర్ శివమ్ దూబేపై సెలెక్టర్లు కన్నేశారు. పాండ్యా స్థానంలో అతడిని తీసుకునే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో శివమ్ దుబే  బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. పాండ్యాకు ఛాన్స్ ఇస్తారా లేదా అతడి స్థానంలో దుబేను అవకాశం ఇస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. 

Also Read: Shivam Dube: వెరైటీ ప్రేమకథ.. ఒకే అమ్మాయిని రెండు సార్లు పెళ్లి చేసుకున్న CSK స్టార్ ప్లేయర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News