ICC Best Team: కోహ్లీ, రోహిత్‌కు ఐసీసీ షాక్.. 2023 టీ20 అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

ICC T20s Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు భారత స్టార్‌ ఆటగాడు సూర్య కుమార్‌ యాదవ్‌ సారథిగా ఎంపికవడం విశేషం. ఈ జట్టులో భారత్‌ నుంచే అత్యధిక ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. ఈ జట్టులో మన పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. జట్టు వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 08:13 PM IST
ICC Best Team: కోహ్లీ, రోహిత్‌కు ఐసీసీ షాక్.. 2023 టీ20 అత్యుత్తమ జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

ICC T20I Best Team: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రతియేటా (ఐసీసీ) ప్రకటిస్తుంటుంది. 2023 సంవత్సరానికి కూడా టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ జట్టును తాజాగా ఐసీసీ ప్రకటించింది. సోమవారం ప్రకటించిన ఈ జట్టుకు కెప్టెన్‌గా భారత విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యాడు. భారత స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కాకుండా అనూహ్యంగా సూర్య ఎంపికవడం ఆసక్తికరం. వారిద్దరినీ విస్మరించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ జట్టులో భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్‌, రవి భిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు ఈ జట్టులో ఐసీసీ స్థానం కల్పించింది. అత్యుత్తమ జట్టులో మొత్తం నలుగురు ఎంపికవడం విశేషం. 

ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్య ఎంపికవడం వెనుక అతడి కృషి ఉంది. గతేడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో సూర్యను భారత జట్టును అద్భుతంగా సారథ్యం వహించాడు. గతేడాది సూర్యకుమార్‌ 18 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 733 పరుగులు సాధించి సత్తా చాటాడు. వీటిలో రెండు శతకాలు ఉన్నాయి. ఇక యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ గతేడాది 15 మ్యాచ్‌లు ఆడి 430 పరుగులు సాధించాడు. రవి బిష్ణోయ్‌ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి ఇప్పుడు ఐసీసీ అత్యుత్తమ జట్టులో ఎంపికయ్యాడు. బౌలింగ్‌ విభాగంలో ఎంపికైన అర్ష్‌దీప్‌ సింగ్‌ గత సంవత్సర 21 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. తన బౌలింగ్‌తో మెరుగైన ప్రదర్శన చేశాడు. 

ఐసీసీ 2023 టీ20 అత్యుత్తమ జట్టులో యశస్వికి జతగా ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ను ఓపెనర్‌గా ప్రకటించింది. వన్‌డౌన్‌లో వెస్టిండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌, నాలుగో స్థానంలో సూర్య కుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్‌ రజా, ఉగాండ ఆటగాడు అల్పేష్‌ రంజనీ, బౌలర్ల జాబితాలో ఐర్లాండ్‌ నుంచి మార్క్‌ అడైర్‌, భారత్‌ నుంచి రవి భిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జింబాబ్వే బౌలర్‌ రిచర్డ్‌ నగరవ ఎంపికయ్యాడు. కాగా, అత్యుత్తమ జట్టులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్‌ జట్ల నుంచి ఒక్క ఆటగాడు కూడా ఐసీసీ ఎంపిక చేయడకపోవడం గమనార్హం.

కోహ్లీ, విరాట్‌కు షాక్‌
గతేడాది అత్యుత్తమ ప్రదర్శనల కనబర్చిన వారిలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ కూడా ఉన్నారు. కీలకమైన ఇన్నింగ్స్‌ వారిద్దరూ ఆడారు. కానీ ఐసీసీ మాత్రం వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇతర ఫార్మాట్‌లలో వారి ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. కానీ టీ20 ఫార్మాట్‌లో సూర్య ప్రదర్శన కన్నా వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విరాట్‌, రోహిత్‌ ను కాదని సూర్యను ఐసీసీ ఎంపిక చేసింది. ప్రదర్శననే కొలమానంగా తీసుకుని ఐసీసీ ఈ జట్టును ప్రకటించింది.

 

Also Read: One Man Five Women Preganant: వీడు మగాడ్రా బుజ్జి.. 22 ఏళ్లకే ఐదుగురు భార్యలు, ఒకేసారి తల్లులు కాబోతున్నారు

Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News