Rishabh Pant Post: యాక్సిడెంట్ తరువాత మొదటి పోస్ట్..ఆ ఇద్దరినీ పరిచయం చేస్తూ రిషబ్ పంత్ ఎమోషనల్!

Rishabh Pant Social media Post: రోడ్డు ప్రమాదం తర్వాత భారత క్రికెటర్ రిషబ్ పంత్ కాలికి శస్త్రచికిత్స చేయించుని అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 16, 2023, 10:31 PM IST
Rishabh Pant Post: యాక్సిడెంట్ తరువాత మొదటి పోస్ట్..ఆ ఇద్దరినీ పరిచయం చేస్తూ రిషబ్ పంత్ ఎమోషనల్!

Rishabh Pant Social media Post: రోడ్డు ప్రమాదం తర్వాత భారత క్రికెటర్ రిషబ్ పంత్ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇక యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆయన తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ ఇండియాలో పోస్ట్ చేశారు. తన శస్త్రచికిత్స విజయవంతమైందని, మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ప్రయాణం కూడా ప్రారంభమైందని సోషల్‌మీడియాలో చెప్పుకొచ్చాడు రిషబ్.

అలాగే రోడ్డు ప్రమాదం తర్వాత తనకు సహకరించిన వారందరికీ పంత్ కృతజ్ఞతలు తెలిపారు, ప్రమాదం తర్వాత ఇద్దరు యువకులు తనకు సహాయం చేశారని పంత్ రాసిన ప్రత్యేక పోస్ట్‌లో తెలిపారు. ఇద్దరు యువకులను హాస్పిటల్ కు పిలిపించుకుని వారిని ఫోటో తీసి షేర్ చేయడం ద్వారా పంత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఇద్దరు యువకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పంత్ పోస్టులో తెలిపాడు. పంత్ ప్రాణాలను కాపాడి, ప్రమాదం తర్వాత ఆసుపత్రికి తరలించిన రజత్ కుమార్, నిషు కుమార్ ఇద్దరికీ ప్రత్యేక ట్వీట్‌లో పంత్ కృతజ్ఞతలు తెలిపారు.  

రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో రిషబ్ పంత్‌ను రక్షించడానికి ఇద్దరు యువకులు రజత్, నిషు ముందు వచ్చారు. ఇద్దరూ పంత్ లగేజీని సర్దుకుని హాస్పిటల్ కి చేరుకోవడానికి సహాయపడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ పోలీసులకు ప్రమాద సమయంలో పంత్ పోగొట్టుకున్న నాలుగు వేల రూపాయలు కూడా అప్పగించారు. ఇక పంత్ పరిస్థితి ప్రమాదం నుండి బయటపడిన తర్వాత, ఆ ఇద్దరిని కలవడానికి ఆస్పత్రికి పిలిపించుకున్నారు. నిజానికి రజత్, నిషులు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని పుర్కాజీ నివాసితులు.

ప్రమాదం గురించి మాట్లాడుతూ, ఇద్దరూ ఉదయం పనికి వెళుతున్నామని చెప్పారు. ఆ తర్వాత పెద్ద చప్పుడుతో ఓ కారు ఢీకొట్టగా ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయని వెల్లడించారు. అక్కడికి చేరుకున్నప్పుడు, కారులో ఉన్న యువకుడు రోడ్డుపై నొప్పితో మూలుగుతున్నాడని, వెంటనే గాయపడిన రిషబ్ పంత్‌ను తన షీట్‌తో కప్పి, తలపై గుడ్డ కట్టామని వెల్లడించారు. తద్వారా నుదిటిపై గాయం నుండి రక్తం కారడం ఆగిందని, ఇంతలో హర్యానా రోడ్‌వేస్ బస్సు రావడం ఆ బస్సు డ్రైవర్‌-ఆపరేటర్‌ వెంటనే 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. అయితే గాయపడిన వ్యక్తి రిషబ్ పంత్ అని తరువాత వార్తల్లో చూసేవరకు వారికి తెలియదట. పంత్‌ని అంబులెన్స్‌లో ఎక్కించి ఇద్దరూ తమ తమ పనికి వెళ్లిపోయారట. 
Also Read: Vijay Antony injured: బిచ్చగాడు హీరోకి తీవ్ర గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

Also Read: Pallavi Joshi injured: కాశ్మీరీ ఫైల్స్ నటికి షూట్ లో యాక్సిడెంట్.. హుటాహుటిన హాస్పిటల్ కు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News