Kane Williamson equaled Sachin's Record: కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు ఈక్వల్!

New Zealand Vs Sri Lanka 2nd Test live Updates: కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను నమోదు చేశాడు.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 06:47 PM IST
Kane Williamson equaled Sachin's Record: కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు ఈక్వల్!

Kane Williamson Equaled Sachin's Record: న్యూజిలాండ్ మాజీ టెస్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. లంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో చెలరేగి ఆడుతున్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన కేన్ మామ.. రెండో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగిస్తూ ద్విశతకం బాదేశాడు. అతడు 296 బంతుల్లో 215 పరుగులు చేశాడు. ఇది అతడికి ఆరో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో ఈ ఫీట్ సాధించిన సచిన్, సెహ్వాగ్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సరసన చేరాడు. టెస్టు క్రికెట్ లో బ్రాడ్‌మన్‌ మాత్రమే 12 డబుల్ సెంచరీలు చేశాడు. 

అంతేకాకుండా కేన్ విలియమ్సన్ మరో రికార్డు కూడా సృష్టించాడు. న్యూజిలాండ్ తరపున 8 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల కేన్ 94 టెస్టుల్లో 164 ఇన్నింగ్స్‌ల్లో 54.89 సగటుతో 8124 పరుగులు చేశాడు. ఇందులో ఆరు డబుల్‌ సెంచరీలు, 28 సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్‌ కన్నా కూడా అధికంగా ఉంది. దీంతోపాటు టెస్టుల్లో 28 శతకాలు చేసిన కోహ్లీ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. 

గతేడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి కేన్ వైదొలిగాడు. న్యూజిలాండ్ మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఇది చివరి ద్వైపాక్షిక మ్యాచ్. రెండు టెస్టుల సిరీస్ లో కివీస్ 1-0 లీడ్ లో ఉంది. ప్రస్తుత జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో కేన్ తో పాటు నికోల్స్ కూడా ద్విశతకం సాధించాడు.

Also Read: IPL 2023 Updates: ఆర్సీబీ జట్టులో కీలకమార్పు, టాప్ హిట్టింగ్ బ్యాటర్ జట్టులో చేరిక

Also Read: Taraka Ratna Wife Emotional: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ అమోశానల్ పోస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News