గౌతం గంభీర్‌పై గరం అవుతున్న ధోని ఫ్యాన్స్

గౌతం గంభీర్‌పై గరం అవుతున్న ధోని ఫ్యాన్స్

Last Updated : Mar 30, 2019, 11:46 PM IST
గౌతం గంభీర్‌పై గరం అవుతున్న ధోని ఫ్యాన్స్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ''ధోనీ అంటే గంభీర్‌కి మొదటి నుంచి అసూయే'' అంటూ ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు. అయితే, ధోనీ అభిమానులు అంత ఆగ్రహానికి గురయ్యేంత పెద్ద తప్పు గంభీర్ ఏం చేశాడా అనే కదా మీ డౌట్!! మరేం లేదు.. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ కనబర్చిన ప్రతిభను గౌతం గంభీర్ అభినందించాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 102 పరుగులు చేసి ఐపిఎల్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న శాంసన్‌ను ప్రశంసించే క్రమంలో ''దేశంలోనే ఉత్తమమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్" అని గౌతం గంభీర్ పేర్కొన్నాడు. 

సంజు శాంసన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన గౌతం గంభీర్.. ''అతడికి 2019 వరల్డ్ కప్‌లో చోటు కల్పించి 4వ స్థానంలో బ్యాటింగ్‌కి దింపితే బాగుంటుంది'' అని సూచించాడు. సరిగ్గా గౌతం గంభీర్ చేసిన ఈ ట్వీటే ధోని ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అందుకే గంభీర్‌పై ధోని ఫ్యాన్స్ ఒంటికాలితో లేస్తున్నారు. 

Trending News