వీడియో: బైక్ రైడింగ్ కామన్.. స్పీడ్ బోట్ నడిపిన ధోనీ

Dhoni drives speedboat టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ సహచరుడు ఆర్పీ సింగ్ ఫ్యామిలితో కలిసి మాల్దీవులు వెళ్లాడు. స్పీడ్ బోటు నడుపుతూ ఎంజాయ్ చేసే వీడియో వైరల్ అవుతోంది.

Last Updated : Feb 3, 2020, 01:23 PM IST
వీడియో: బైక్ రైడింగ్ కామన్.. స్పీడ్ బోట్ నడిపిన ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో పాటు వెకేషన్‌కు వెళ్లిన ధోనీ.. తనతో పాటు మాజీ సహచరుడు రుద్ర ప్రతాప్ సింగ్ (ఆర్పీ సింగ్), అతడి భార్యను తీసుకెళ్లారు. గతేడాది వన్డే ప్రపంచ కప్ సెమీస్ ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు ధోనీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆర్మీకి సేవలందించి మానసిక స్థైర్యాన్ని కూటగట్టుకున్నాడు ‘మిస్టర్ కూల్’ ధోనీ. కొన్ని రోజుల కిందట ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి భార్య సాక్షితో కలిసి వెళ్లి కుటుంబంతో సరాదాగా గడిపాడు.

ప్రస్తుతం ధోనీ మాల్దీవులలో హాయిగా విహరిస్తున్నాడు. మాజీ సహచరుడు, క్రికెటర్ ఆర్పీ సింగ్, ఆయన భార్య దేవాన్షి పోపట్‌లతో కలిసి వెళ్లడం ఈసారి ధోనీ టూర్ స్పెషల్. ఆర్పీ సింగ్ ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ధోనీకి బైకులంటే ఎంత ఇష్టమో అతడు టీమిండియాకు ఆడిన తొలిరోజుల్లోనే అందరికీ తెలిసింది. అయితే మాల్దీవులలో ధోనీ కొత్త అవతారంలో కనిపించాడు. కెప్టెన్ సూచనలతో స్పీట్ బోటును నడుపుతూ ఓ వీడియోలో దర్శనమిచ్చాడు. సాధారణంగా బైక్స్, జీపులు నడుపుతాడు బట్ ఫర్ ఏ ఛేంజ్.. స్పీడ్ బోటు నడుపుతున్నాడు ధోనీ అని క్యాప్షన్‌తో ప్రభు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

గతేడాది ప్రపంచ కప్ అనంతరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేవ్, వెస్టిండీస్ ఏ సిరీస్‌లలోనూ ధోనీ ఆడలేదు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోణపు టోర్నీకి ధోనీని ఎంపిక చేయలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన 5 టీ20 సిరీస్‌కు, వన్డే, టెస్ట్ సిరీస్‌లకు ధోనీని మేనేజ్ మెంట్ పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News