Jasprit Bumrah: బుమ్రాకు షాకిచ్చిన ఐసీసీ.. డీమెరిట్ పాయింట్ విధింపు..

Jasprit Bumrah: భారత పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ షాకిచ్చింది. ఉప్ప‌ల్ మ్యాచ్ లో ఐసీసీ నియమావ‌ళిని ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2024, 10:04 PM IST
Jasprit Bumrah: బుమ్రాకు షాకిచ్చిన ఐసీసీ.. డీమెరిట్ పాయింట్ విధింపు..

ICC-Jasprit Bumrah : టీమిండియా స్టార్ పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు ఐసీసీ షాకిచ్చింది. ఉప్ప‌ల్ మ్యాచ్ లో ఐసీసీ నియమావ‌ళి(ICC Code Of Conduct)ని ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ కొన‌సాగుతుండ‌గా బుమ్రా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఓలీ పోప్‌(Ollie Pope)కు అడ్డు త‌గిలాడు. బుమ్రా తీరుతో పోప్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. బుమ్రా లెవల్ 1 నేరానికి పాల్ప‌డ్డాడ‌ని మ్యాచ్ రిఫ‌రీ ఐసీసీకి నివేదించాడు. ఇదే విష‌యంపై బుమ్రాను ప్రశ్నించగా .. అతడు తప్పు ఒప్పుకున్నాడు. దాంతో రిఫరీ అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఉప్పల్ టెస్టులో బుమ్రా నాలుగు వికెట్లతో రాణించాడు.

తొలి టెస్టులో ఇంగ్లండ్‌ అద్భుతం చేసిందనే చెప్పాలి. ఆశల్లేని  స్థితి నుంచి గొప్పగా పోరాడి గెలిచింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ హార్ట్లీ ఏడు వికెట్ల తీసి టీమ్‌ఇండియా పతనాన్ని శాసించాడు. 231 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 202కే కుప్పకూలింది. ఓలీ పోప్ అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్ కు మంచి ఆధిక్యాన్ని  అందించాడు. ఇరుజట్ల మ‌ధ్య వైజాగ్‌లో ఫిబ్ర‌వ‌రి 2న రెండో టెస్టు జ‌రుగ‌నుంది. . కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. వీరి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌లను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ.

రెండో టెస్టుకు టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్.

Also Read: India vs England Squad: రెండో టెస్టు నుంచి జడేజా, కేఎల్ రాహుల్ ఔట్.. ఎట్టకేలకు సర్ఫరాజ్‌ ఖాన్‌కు పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News