Rishabh Pant At DC vs GT Match: మ్యాచ్ చూసేందుకు వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదిగో

Rishabh Pant At DC vs GT Match: తన కారులో అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్న రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, స్టేడియం సిబ్బంది దగ్గరుండి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. కారులోంచి దిగడానికి ఇబ్బందిపడిన రిషబ్ పంత్‌కి అక్కడి సిబ్బంది సహాయం చేశారు. 

Written by - Pavan | Last Updated : Apr 5, 2023, 05:06 AM IST
Rishabh Pant At DC vs GT Match: మ్యాచ్ చూసేందుకు వచ్చిన రిషబ్ పంత్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదిగో

Rishabh Pant At DC vs GT Match: రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం బారినపడి తీవ్రంగా గాయపడినప్పటి నుంచి బెడ్డుకి, ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్‌కి పలు శస్త్ర చికిత్స జరిగాయి. ప్రస్తుతం వాకింగ్ స్టిక్ సహాయంతో నడుస్తున్నాడు. అలాంటి స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చాడు.

తన కారులో అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్న రిషబ్ పంత్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, స్టేడియం సిబ్బంది దగ్గరుండి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. కారులోంచి దిగడానికి ఇబ్బందిపడిన రిషబ్ పంత్‌కి అక్కడి సిబ్బంది సహాయం చేశారు. వాకింగ్ స్టిక్ సహాయంతో ఇబ్బందిపడుతూ రిషబ్ పంత్ లోపలికి వెళ్లడం దృశ్యాలను నెటిజెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 

 

స్టేడియం లోపల మ్యాచ్ చూసేందుకు వచ్చిన రిషబ్ పంత్‌కి సాదర స్వాగతం పలికిన తోటి మిత్రులు, సిబ్బంది.. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకొంతమంది స్నేహపూర్వకంగా ఒక ఫ్రెండ్లీ హగ్ ఇచ్చి అతడి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

 

ఈ సందర్భంగా స్టేడియంలోని కెమెరాలు తననే ఫోకస్ చేయడం స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌లో చూసిన రిషబ్ పంత్.. తన అభిమానులకు అభివాదం చేస్తున్నట్టు వారికి చేయి ఊపి పలకరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు రిషబ్ పంత్ కూడా స్టేడియంకు వచ్చాడని అక్కడున్న బిగ్ స్క్రీన్స్‌పై చూసి తెలుసుకున్న అభిమానులు.. గట్టిగా అరుస్తూ తమ కేరింతలతోనే అతడికి వెల్‌కమ్ చెప్పారు.

ఇది కూడా చదవండి : Rajat Patidar Ruled Out: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ షాక్.. ఐపీఎల్ 2023 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!

ఇది కూడా చదవండి : DC vs GT Dream11 Team Prediction: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్‌ టైటాన్స్‌ హై ఓల్టేజ్ మ్యాచ్‌.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News