IPL 2024: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ఖాయమేనా, ప్యాట్ కమిన్స్ దశ మార్చనున్నాడా

IPL 2024: ఐపీఎల్ 2024 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు చోటుచేసుకోవడమే కాదు..రధ సారధులు కూడా మారుతున్నారు. ఒకప్పుడు మేటి జట్టుగా ఉన్న ఆరెంజ్ ఆర్మీ సైతం సారధిని మార్చుకునేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2024, 10:21 AM IST
IPL 2024: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ఖాయమేనా, ప్యాట్ కమిన్స్ దశ మార్చనున్నాడా

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024  ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు బరిలో దిగుతుండగా ఈసారి ప్రతి జట్టులో అనూహ్య మార్పులు కన్పించనున్నాయి. కొత్త ఆటగాళ్లు, కొత్త కెప్టెన్లతో పది ఫ్రాంచైజీలు టైటిల్ పోరుకు సిద్ధమౌతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కొత్త మార్పులు చేర్పులతో గత వైభవాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉంది.

ఐపీఎల్ 2024 సీజన్ 17 కౌంట్‌డౌన్ మొదలైంది. అన్ని ఫ్రాంచైజీలు కీలక మార్పులతో సిద్ధమౌతుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డనుంది. అందుకే 20.5 కోట్లతో వేలంలో కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్, వరల్డ్ కప్ హీరో ప్యాట్ కమిన్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీకు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా సారధి ఎయిడెన్ మార్క్‌రమ్ వ్యవహరిస్తున్నాడు. మార్క్‌రమ్‌ను తప్పించి ప్యాట్ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించే విషయపై తుది నిర్మయం ఇంకా తీసుకోలేదు కానీ దాదాపుగా ఖాయమైందని సమాచారం. 

ఒకప్పుడు అంటే డేవిడ్ వార్నర్ నేతృత్వంలో పటిష్టమైన, బెస్ట్ టీమ్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్రమంగా ఆ ప్రాభవం కోల్పోయింది. దాంతో డేవిడ్ వార్నర్‌ను తప్పించి విలియమ్సన్‌కు బాధ్యతలు అప్పగించడం, అప్పటికీ రాణించకపోవడంతో ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కెప్టెన్ చేయడం తెలిసిందే. అయితే మార్క్‌రమ్ సారధ్యంలో కూడా ఆరెంజ్ ఆర్మీ పేలవమైన ప్రదర్శనే చూపించింది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. 

కానీ ఇటీవలే మార్క్‌రమ్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈస్టర్న్ ఎస్ఏ 20 లీగ్ టైటిల్ గెల్చుకుంది. అందుకే మార్క్‌రమ్‌ను తొలగించాలా లేదా అనేది ఇంకా అధికారికంగా ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం నిర్ణయించుకోలేదు. ఇక ప్యాట్ కమిన్స్ అయితే సమర్ధవంతమైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు.  గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్ అందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ మార్చ్ 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనుంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ఆరెంజ్ ఆర్మీ దశ మారుతుందో లేదే వేచి చూడాలి.

Also read: Gautam Gambhir: గౌతమ్ గంభీర్ అస్త్ర సన్యాసం అందుకేనా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News