IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 వేలం ఆటగాళ్ల జాబితా రెడీ, ఎవరు ఏ సెట్‌లో, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉంది

IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 మేగావేలానికి అంతా సిద్ధమైంది. విక్రయానికి సిద్దమైన ఆటగాళ్లెవరనేది తుది జాబితా విడుదలైంది. ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉందనే వివరాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2023, 02:13 PM IST
IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 వేలం ఆటగాళ్ల జాబితా రెడీ, ఎవరు ఏ సెట్‌లో, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉంది

IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 వేలం మరో వారం రోజుల్లో అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసింది. మొత్తంత 77 స్లాట్స్ కోసం 333 మంది ఆటగాళ్లు పోటీ పడనుండటంతో వేలం ఆసక్తిగా జరగనుంది. ఏ ఆటగాళ్లు ఏ సెట్‌లో ఉన్నారనేది తెలుసుకుందాం..

ఐపీఎల్ 2024 వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19వ తేదీ మద్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలకు కలిపి 77 ఖాళీలున్నాయి. ఇందులో విదేశీ ఆటగాళ్లకు 30 ఉంటే భారతీయులకు 47 అందుబాటులో ఉంటాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. వీరిలో 214 మంది భారతీయులు కాగా, 119 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మొత్తం 333 మంది వేలానికి సిద్ధమైన ఆటగాళ్లలో 116 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన 17 ఏళ్ల క్వెనా మఫాకా అత్యంత పిన వయస్కుడు కాగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 39 ఏళ్ల మొహమ్మద్ నబీ అందరికంటే పెద్దవాడు. ఐపీఎల్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన జాబితాలో సెట్ వారీగా కొందరి పేర్లు ఇలా ఉన్నాయి..

సెట్ నెంబర్ 1 లో హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రోవ్ మన్ పావెల్, రిలీ రొస్సో, స్టీవ్ స్మిత్ ఉన్నారు. ఇక సెట్ నెంబర్ 2లో గెరాల్డ్ కోయెట్జీ, పాట్ కమిన్స్, వనిందు హసరంగా, డారిల్ మిచెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్షల్ పటేల్, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, క్రీస్ వోక్స్ ఉన్నారు. 

సెట్ నెంబర్ 3లో కేఎస్ భరత్, జోస్ ఇంగ్లీష్, కుశాల్ మెండిస్, ఫిలిప్ సాల్ట్, ట్రిస్టన్ స్టబ్స్ ఉంటే సెట్ నెంబర్ 4లో లోకీ ఫెర్గూసన్్, జోష్ హేజిల్ వుడ్, అల్జరీ జోసెఫ్, మధుశంక, శివమ్ మావి, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, జయదేవ్ ఉనద్కత్, ఉమేష్ యాదవ్ ఉన్నారు. ఇక ఐపీఎల్ వేలంలో ఉన్న తెలుగు ఆటగాళ్లలో అభిషేక్ మురుగన్, రాహుల్ బుద్ధి, రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి, రవితేజ, తనయ్ త్యాగరాజన్, అరవెల్లి అవినాశ్ రావు, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, శ్రీకర్ భరత్, రికీ భుయ్, హనుమ విహారి, పృధ్వీరాజ్ ఉన్నారు. 

చెన్నై సూపర్‌కింగ్స్ వద్ద ఆరు ఖాళీలుంటే 31.4 కోట్లు పర్సులో ఉన్నాయి. ఢిల్లీ కేపిటల్స్‌లో 9 ఖాళీలుంటే పర్సులో 28.95 కోట్లున్నాయి. గుజరాత్ టైటాన్స్ వద్ద అత్యధికంగా 38.15 కోట్లుంటే 8 మంది ఆటగాళ్లు కావల్సి ఉంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద 32.7 కోట్లుంటే 12 ఆటగాళ్లు అవసరం. లక్నో సూపర్ జెయింట్స్ పర్సులో అత్యల్పంగా 13.15 కోట్లు మాత్రమే ఉండగా 6 మంది ఆటగాళ్లు ఈ జట్టుకు అవసరం. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో కూడా కేవలం 17.75 కోట్లే ఉన్నాయి. కానీ 8 మంది ఆటగాళ్లను తీసుకోవల్సి ఉంది. 

ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు పర్సులో 29.1 కోట్లుంటే 8 మంది ఆటగాళ్ల ఖాళీలున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పర్సులో 23.5 కోట్లుంటే 6 మంది ఆటగాళ్లు అవసరం. రాజస్థాన్ రాయల్స్ జట్టు వ్యాలెట్‌లో 14.5 కోట్లుంటే 8 మంది ఆటగాళ్లు అవసరమౌతున్నారు. ఇక హైదరాబాద్ జట్టు పర్సులో అత్యదికంగా 34 కోట్లుంటే కేవలం 6 మంది అవసరముంది. 

Also read: IPL 2024 Auction: మరో వారం రోజుల్లో ఐపీఎల్ వేలం, అందరి దృష్టి ఆ నలుగురిపైనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News