IPL Acution 2024: ఐపీఎల్ 2024 వేలం ఎప్పుడు ప్రారంభం, ఎందులో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు, ఏ టీమ్ పర్సులో ఎంత మిగిలుంది

IPL Acution 2024: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2024 మెగా వేలానికి సమయం సమీపించింది. దుబాయ్ వేదికగా రేపు ఐపీఎల్ వేలం జరగనుంది. ఏయే ఫ్రాంచైజీలు వద్ద ఎంత డబ్బు మిగిలుంది, ఎంతమంది ఆటగాళ్లున్నారు, లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడవచ్చనే వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2023, 01:54 PM IST
IPL Acution 2024: ఐపీఎల్ 2024 వేలం ఎప్పుడు ప్రారంభం, ఎందులో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు, ఏ టీమ్ పర్సులో ఎంత మిగిలుంది

IPL Acution 2024: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిగంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. రేపు మద్యాహ్నం 1 గంటకు ఐపీఎల్ వేలం మొదలౌతుంది. ఇప్పటికే మొత్తం పది ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ జాబితాలు ప్రకటించడంతో ఆటగాళ్ల తుది జాబితా సిద్ధమైంది. ఐపీఎల్ వేలం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఐపీఎల్ 2024 వేలం రేపు అంటే డిసెంబర్ 19 మద్యాహ్నం 1 గంటకు దుబాయ్ వేదికగా జరగనుంది. మొత్తం 1166 మంది ఆటగాళ్లు వేలం కోసం పేర్లు నమోదు చేసుకోగా 333 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లుంటే, 119 మంది విదేశీయులున్నారు. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 77 మందిని తీసుకోనున్నాయి. ఐపీఎల్ వేలం దేశం వెలుపల జరగడం ఇదే తొలిసారి. ఈసారి వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు ట్రేవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ , న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ప్రధాన ఆకర్షణగా మారనున్నారు. అంతేకాకుండా అన్ని జట్లు వీరిపై దృష్టి సారించడంతో భారీ ధర పలికే అవకాశాలున్నాయి. 

ఐపీఎల్ 2024 ఎందులో చూడవచ్చు

ఐపీఎల్ 2024 వేలం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. అయితే స్టార్ స్పోర్ట్స్ వేలం లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం లేదు. కానీ జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించవచ్చు. రేపు మద్యాహ్నం 1 గంటకు వేలం ప్రారంభమౌతుంది. 

ఐపీఎల్ 2024 వేలం-ఏ ఫ్రాంచైజీ పర్సులో ఎంత ఉంది

గుజరాత్ టైటాన్స్                                  38.15 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్                          34 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్                               32.7 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్                                31.4 కోట్లు
పంజాబ్ కింగ్స్ లెవెన్                             29.1 కోట్లు
ఢిల్లీ కేపిటల్స్                                         28.95 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు             23.25 కోట్లు
ముంబై ఇండియన్స్                               17.75 కోట్లు
రాజస్థాన్ రాయల్స్                                 14.5 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్                        13.15 కోట్లు

Also read: Ind Vs SA Highlights: తొలి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News