Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన ఇండియా, ఆఫ్ఘన్ జట్టు ఇదే

Ind vs Afg: దక్షిణాఫ్రికా పర్యటన ముగింంచుకున్న టీమ్ ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమౌతోంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మూడు టీ 20ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 7, 2024, 09:12 AM IST
Ind vs Afg: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైన ఇండియా, ఆఫ్ఘన్ జట్టు ఇదే

Ind vs Afg: దక్షిణాఫ్రికా గడ్డపై ఆ దేశంతో టెస్ట్ సిరీస్ సమం చేసుకున్న టీమ్ ఇండియా త్వరలో మరో సిరీస్ ఆడనుంది. టీ20 సిరీస్ కోసం తొలిసారి ఇండియా వస్తున్న ఆప్ఘనిస్తాన్ జట్టుతో తలపడనుంది. జనవరి 11, 14, 17 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. 

టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. మరో నాలుగు రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీ20 సిరీస్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ నేతృత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి స్వదేశంలో జరిగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మాత్రం ఆడనున్నాడు. మూడు టీ20ల్లో మొదటి టీ20 మ్యాచ్ జనవరి 11వ తేదీన మొహాలీలో జరగనుంది. ఇక రెండవ టీ 20 మ్యాచ్ జనవరి 14వ తేదీన ఇండోర్ వేదికగా జరుగుతుంది. చివరి టీ20 మ్యాచ్ జనవరి 17వ తేదీన బెంగళూరు వేదికగా జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌లు సాయంతం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇప్పటికే ఆ దేశం ప్రకటించగా టీమ్ ఇండియా జట్టు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వెస్డిండీస్-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో ఆఫ్ఘనిస్తాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు

ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం అఖిల్, హజ్రతుల్లా బజాయ్, రెహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, కరీమ్ జనా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, సహ్రపుధ్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్ హుక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హఖ్, నూర్ అహ్మద్, మొహమ్మద్ సలీమ్, ఖాయిస్ అహ్మద్, గుల్ఫాదిన్ నయీబ్, రషీద్ ఖాన్

Also read: Parthasarathy meets Chandrababu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడనున్న మరో ఎమ్మెల్యే, కారణాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News