Chetan Sharma Resigns: సెలెక్టింగ్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా, వెంటనే ఆమోదం!

Chetan Sharma Resigned:  భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు, స్టింగ్ ఆపరేషన్ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 17, 2023, 12:09 PM IST
Chetan Sharma Resigns: సెలెక్టింగ్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా, వెంటనే ఆమోదం!

Chetan Sharma Resigns after Sting Operation: భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. జీ న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత జట్టు సహా భారత ఆటగాళ్లకు సంబంధించిన పలు విషయాలను బయట పెట్టాడు. ఈ స్టింగ్ ఆపరేషన్ బయటకు వచ్చిన తరువాత నుంచి ఆయన నిత్యం వివాదాల్లోనే మునిగి తేలుతున్నాడు. ఇక ఈ వివాదాల క్రమంలోనే ఆయన ఇండియన్ మెన్ క్రికెట్ టీమ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. చేతన్ శర్మ తన రాజీనామాను బీసీసీఐ కార్యదర్శి జై షాకు పంపగా, ఆయన వెంటనే చేతన్ శర్మ రాజీనామాను ఆమోదించారు.  

జీ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ సందర్భంగా భారత జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ 80 శాతం వరకు మాత్రమే ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని తమను తాము ఫిట్‌గా చేసుకుంటూ జట్టులో స్థానం సంపాదించుకుంటారంటూ పలు సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 100 శాతం ఫిట్‌ని చూపించవచ్చని, ఈ ఇంజెక్షన్లు డోపింగ్ పరీక్షలో కూడా పట్టుబడవు అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రాని ఇదే విధమైన ఇంజెక్షన్‌తో ప్రపంచ కప్‌కు ముందు హడావిడిగా తిరిగి వచ్చేలా చేశారని, ఆ ఇంజెక్షన్ కారణంగా అతను ఇప్పటివరకు పూర్తిగా ఫిట్‌గా తిరిగి రాలేకపోయాడని చేతన్ శర్మ పేర్కొన్నారు. ఇక అంతేకాక చేతన్ శర్మ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడం వెనుక ఉన్న కారణాలు కూడా వెల్లడించారు, అదేమంటే విషయం బోర్డు vs ప్లేయర్‌గా మారినప్పుడు, ప్లేయరే ఆ భారాన్ని భరించవలసి వచ్చిందని ఆయన అన్నారు.

రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేయాలనే నిర్ణయం వెనుక సౌరవ్ గంగూలీ హస్తం లేదని చేతన్ శర్మ అన్నారు. ఇక జట్టులో కొనసాగడానికి ఆటగాళ్ళు తనతో సన్నిహితంగా ఉంటారని చేతన్ శర్మ ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని కూడా బహిర్గతం చేశారు. KL రాహుల్, హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ శర్మతో సహా చాలా మంది ఆటగాళ్లకు తాను సన్నిహితంగా ఉంటారని ఆయన పేర్కొన్నాడు. అలాగే చేతన్ శర్మ రోహిత్ శర్మ, విరాట్ మధ్య వివాదానికి సంబంధించిన వార్తలను పూర్తిగా తప్పు అని ఖండించాడు, విరాట్ కోహ్లీ తన బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు, రోహిత్ శర్మ నుండి ఆయనకు ఎక్కువ సపోర్ట్ లభించిందని చెప్పాడు. 

ఇక జీ న్యూస్ చేసిన ఈ స్టింగ్ ఆపరేషన్ దెబ్బకు క్రీడా ప్రపంచంలో అలజడి మొదలైంది మరియు చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేయవలసి ఉంటుందని నిరంతరం ఊహాగానాలు తెర మీదకు రాగా చివరికి అదే జరిగింది. ఇక ఈ విషయంపై బీసీసీఐ త్వరలో విలేకరుల సమావేశం నిర్వహించవచ్చని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. నిజానికి అంతకు ముందు T20 ప్రపంచ కప్‌లో ఓటమికి కారణమని మొత్తం సెలక్షన్ కమిటీని రద్దు చేశారు, కానీ చేతన్ శర్మను మాత్రం కొనసాగించారు. 
Also Read: Chetan Sharma Sting Operation: జస్ప్రీత్ బుమ్రా గురించి సంచలనం విషయం బయటపెట్టిన టీమిండియా చీఫ్ సెలక్టర్!

Also Read: Chetan Sharma Sting Operation: ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్స్.. టీమిండియా ప్లేయర్స్ సంచలన విషయాలు బయటపెట్టిన చేతన్ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News