Dream Astrology: అలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకండి, లేకుంటే మీకే నష్టం!

Dream Interpretation:  స్వప్న శాస్త్రంలో కొన్ని కలలను చాలా శుభప్రదంగా భావిస్తారు. కానీ ఈ కలల యొక్క పూర్తి ఫలం ఎవరికీ చెప్పనప్పుడు మాత్రమే లభిస్తుంది. .   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 11:17 AM IST
Dream Astrology: అలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకండి, లేకుంటే మీకే నష్టం!

Dream Astrology: మనం నిద్రపోతున్నప్పుడు రోజూ ఎన్నో కలలు కంటూ ఉంటాయి. ఇందులో కొన్ని మంచి డ్రీమ్స్ ఉంటాయి, మరికొన్ని చెడు కలలు ఉంటాయి. తెల్లవారుజామున వచ్చే డ్రీమ్స్ నిజమవుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. స్వప్నశాస్త్రం (Swapna Shastra) ప్రకారం, మన కలలను బట్టి ప్యూచర్ తెలుసుకోవచ్చట. మనకు మంచి కలలు వచ్చినప్పుడు వాటి గురించి ఎవరికీ చెప్పకూడదంట. ఎందుకంటే వాటి శుభఫలితాలు తగ్గుతాయట. అయితే చెడు కలలు గురించి వీలైనంత ఎక్కువ మందికి చెప్పాలి. ఇది ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీ కలలో ఇవి కనిపిస్తే చాలా శుభప్రదం. 

కలలో వెండి కలశం కనిపించడం: స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో వెండి ఆభరణాలు లేదా నాణేలతో నిండిన కలశం కనిపించడం చాలా శ్రేయస్కరం. అలాంటి కల వస్తే, దాని గురించి ఎవరికీ చెప్పకండి. ఈ కల మీ అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. దీని వల్ల మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.  

కలలో చేపలను చూడటం: కలలో చేపలు ఈత కొట్టడం లేదా చేపలను పట్టుకోవడం కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు. అకస్మాత్తుగా మీరు భారీ మెుత్తంలో డబ్బు పొందబోతున్నారని ఆ కల చెబుతుంది. ఈ శుభ కల గురించి ఎవరితోనూ చెప్పకండి.

కలలో తెల్ల తామర లేదా తెల్లని పాము కనిపించడం: నాగదేవత సంపదకు రక్షకుడు. మీ కలలో తెల్లటి పాము కనిపిస్తే, మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అంతే కాకుండా లక్ష్మీదేవికి తామర పువ్వు చాలా ప్రీతికరమైనది. కలలో కమలం కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని అర్థం. 

మీ కలలో పూల తోటను చూడటం: మీ కలలో పూల తోటను చూడటం అంటే మీ జీవితంలో చాలా ఆనందం రాబోతుందని అర్థం. మీరు త్వరలో శుభవార్త వింటారు. ఈ కల గురించి ఎవరితోనూ చెప్పకండి.

Also Read: Dream Astrology: కలలో వినాయకుడు కనిపిస్తే.. ప్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News