Mars transit 2024: మకరరాశిలో ధనశక్తి రాజయోగం.. ఇక ఈ 3 రాశులకు మహార్దశే...

Astro news: రేపు అంగారకుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడు శుక్రుడితో కలిసి ధనశక్తి రాజయోగం చేయబోతున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ఇవ్వనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2024, 10:12 PM IST
Mars transit 2024: మకరరాశిలో ధనశక్తి రాజయోగం.. ఇక ఈ 3 రాశులకు మహార్దశే...

Mars transit in Capricorn 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారాలు జరగబోతున్నాయి. రేపు (ఫిబ్రవరి 5) రాత్రి 9 గంటలకు కుజుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇది జరిగిన వారం రోజులకు శుక్రుడు కూడా అదే రాశిలోకి వెళ్లనున్నాడు. మకరరాశిలో శుక్రుడు మరియు అంగారకుడు కలయిక వల్ల ధనశక్తి రాజయోగం రూపొందుతోంది. 

మేష రాశి
మేష రాశి వారికి ధన శక్తి రాజయోగం కలిసి రానుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తారు. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. నూతన దంపతులకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనస్సు రాశి
మకర రాశిలో కుజుడు మరియు శుక్రుడు సంయోగం వల్ల ధనస్సు రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతిని సాధిస్తారు. మీకు దేనికీ లోటు ఉండదు. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు చేపట్టే ప్రతి ప్రాజెక్టు విజయవంతమవుతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు దారిద్ర్యం నుండి బయటపడతారు. 

Also Read: Shattila Ekadashi 2024 date: షట్టిల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు నువ్వులను ఎందుకు దానం చేస్తారు?

వృషభరాశి
ధనశక్తి రాజయోగం వల్ల వృషభరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే అనుకూల సమయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Astrology - Shani Dev:ఈ 4 రాశుల వారిపై శని దేవుడి తీక్షణ ప్రభావం.. తస్మాత్ జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News