Viral Video: మహిళపై అమానుషం.. జుట్టుపట్టుకుని కొడుతూ దాడి.. వైరల్ వీడియో..

Water Crisis: మహిళను పట్టుకుని కనికరంకూడా లేకుండా ఈడ్చిపడేశాడు. అంతటితో ఆగకుండా జుట్టుపట్టుకని కోడుతూ పైశాచికంగా ప్రవర్తించాడు.  అక్కడున్న వారు ఎవరు కూడా అతగాడి వద్దకు వెళ్లే సాహాసం మాత్రం చేయడం లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 1, 2024, 06:35 PM IST
  • నీళ్లకోసం వెళ్లగా మహిళపై దారుణం..
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు..
Viral Video: మహిళపై అమానుషం.. జుట్టుపట్టుకుని కొడుతూ దాడి.. వైరల్ వీడియో..

Man Brutally Attack Innocent Woman On Water Dispute: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాలలో ప్రజలు ఎండలతో అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి ఇంటి నుంచి బైటకు వెళ్లే సాహాసం మాత్రం చేయడంలేదు. కొందరు ఇదే అదనుగా భావించి  నీటి గొడవలు పడుతున్నారు. ఈక్రమంలో కొందరు తాగు నీటి కోసం కిలీమీటర్లమేర ప్రయాణం చేస్తున్నారు. తాగే నీటి కోసం కొన్ని చోట్ల క్యూలైన్ లు ఉంటారు. దీంతో కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతుంటాయి. కొందరు తమ పరిధిలో ఉండే బావుల దగ్గరికి ఇతరులు రాకుండా చేస్తుంటారు. బెంగళూరులో ఇప్పటికే నీళ్లతో కటకటతో తెగ ఇబ్బందులు పడుతున్నారు.

 

నీళ్ల కోసం తరచుగా గొడవలు జరుగుంటాయి. కొందరు వాగ్వాదానికి దిగడంతో పాటు, భౌతిక దాడులు చేయడానికి సైతం వెనుకాడరు. ఈ క్రమంలోనే నీళ్ల కట కట తీవ్ర దుమారంగా మారింది. నీటి కోసం కొందరు అడవి బాట పడుతుంటారు. కొన్ని వందల మీటర్ల లోతున ఉండే బావిలో, ప్రాణాలకు సైతం తెగించి నీళ్లకోసం కష్టపడుతుంటారు. అచ్చం ఇలాంటి వ్యధను ఒక మహిళ ఎదుర్కొంది. ఆమె గుక్కెడు తాగునీటి కోసం మరో గ్రామానికి వెళ్లింది.దీంతో అక్కడున్న వారంతా ఆమెను నోటికొచ్చినట్లు దూశించారు. అంతేకాకుండా.. అక్కడున్న ఒక వ్యక్తి జుట్టుపట్టుకుని మహిళను హింసిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన సామాజిక మాధ్యమాంలో తీవ్ర దుమారంగా మారింది. ఫతేపూర్ జిల్లా కిషన్ పూర్ గ్రామంలో ఒక మహిళ గవర్నమెంట్ చేతి పంపు నుంచి నీళ్లను నింపుకోవడానికి వెళ్లింది. కానీ అక్కడున్న వారంతా మహిళను అడ్డగించారు. అంతేకాకుండా.. నీళ్లు తీసుకొవద్దని హెచ్చరించారు. అయిన కూడా సదరు మహిళ గుక్కెడు నీళ్లతీసుకెళ్దామని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో అక్కడి వారితో గొడవ జరిగింది.  ఈక్రమంలో ఒక వ్యక్తి సదరు మహిళపట్లు దురుసుగా ప్రవర్తించాడు.

Read More: Phone Addiction: ఇదేం విడ్డూరం.. చిన్నారిని ఆ పనిచేస్తూ ఫ్రిడ్జీలో పెట్టేసిన తల్లి.. వైరల్ వీడియో..

కోపంతో నోటికొచ్చినట్లు కొడుతూ, జుట్టుపట్టుకుని లాగుతూ పైశాచీకంగా ప్రవర్తించాడు. మహిళ వదలాలని వేడుకున్న అతగాడు మాత్రం ఆమెను కనికరించలేదు. చుట్టుపక్కల వారు కూడా ఇదేదో వేడుకగా చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు నెటిజన్లు ఈ వీడియోను చూసి మండిపడుతున్నారు. కేవలం గుక్కెడు నీళ్లకోసం వెళ్తే.. ఇలా దాడిచేస్తారా.. అంటూ కోపంతో ఫైర్ అవుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News