Man Dragged Behind Scooter: ఎంత అరాచకం.. మిట్ట మధ్యాహ్నం వృద్ధుడిని రోడ్డుపై స్కూటీతో లాక్కెళ్లాడు

Man Dragged Behind Scooter: 71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే.. 

Written by - Pavan | Last Updated : Jan 17, 2023, 06:11 PM IST
Man Dragged Behind Scooter: ఎంత అరాచకం.. మిట్ట మధ్యాహ్నం వృద్ధుడిని రోడ్డుపై స్కూటీతో లాక్కెళ్లాడు

Man Dragged Behind Scooter: కొంతమంది జనంలో రాన్రాను రాక్షస ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతోంది. వాళ్లు ఏం చేస్తున్నారో తెలియకుండానే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మంగళవారం బెంగళూరులో పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. 

71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే.. సాహిల్ అనే యువకుడు వేగంగా వచ్చి వృద్ధుడు డ్రైవ్ చేస్తోన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడిని ప్రశ్నించేందుకని వృద్ధుడు కారులోంచి కిందికి దిగేలోపే సదరు యువకుడు తన స్కూటీని ఆపకుండా పోనివ్వసాగాడు. అది చూసిన వృద్ధుడు అతడిని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా స్కూటీ వెనుక భాగాన్ని లాగిపట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ యువకుడు మాత్రం స్కూటీని ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. వెనకాల వృద్ధుడు వేళ్లాడటం చూసి కూడా ఆ యువకుడి మనసు ఏ మాత్రం కరగలేదు. 

యువకుడి అరాచకం చూసిన ఓ ఆటోడ్రైవర్ తన వాహనాన్ని స్కూటీకి అడ్డం పెట్టి యువకుడిని అడ్డుకున్నాడు. దీంతో యువకుడు అక్కడ తన స్కూటీని ఆపక తప్పలేదు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు యువకుడిని అడ్డుకుని అతడి బారి నుండి వృద్ధుడి రక్షించారు. అదృష్టవశాత్తుగా బాధితుడు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు.

వృద్ధుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు నిందింతుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

ఇది కూడా చదవండి : Hostel Girls Protest at Night: రాత్రిపూట 60 మంది హాస్టల్ గాళ్స్ 17 కిమీ నడుచుకుంటూ వెళ్లి..

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News