Dreams Interpretation: కలలకు అర్ధాలుంటాయనేది ఎంతవరకు నిజం, ఆ కలలకు అర్ధమేంటి

Dreams Interpretation: కలలు ఎన్నోరకాలు. కొన్ని కలలు మంచి అనుభూతిని ఇస్తే..మరికొన్ని కలలు భయపెడతాయి. ఇంకొన్ని కలలు కలగాపులగంగా ఉండి..మనస్సును అస్థిరపరుస్తాయి. అసలు కలలకు అర్ధమేంటి, ముఖ్యంగా ఆ కలలు వస్తే..దేనికి సంకేతమో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 02:20 PM IST
Dreams Interpretation: కలలకు అర్ధాలుంటాయనేది ఎంతవరకు నిజం, ఆ కలలకు అర్ధమేంటి

Dreams Interpretation: కలలు ఎన్నోరకాలు. కొన్ని కలలు మంచి అనుభూతిని ఇస్తే..మరికొన్ని కలలు భయపెడతాయి. ఇంకొన్ని కలలు కలగాపులగంగా ఉండి..మనస్సును అస్థిరపరుస్తాయి. అసలు కలలకు అర్ధమేంటి, ముఖ్యంగా ఆ కలలు వస్తే..దేనికి సంకేతమో తెలుసుకుందాం.

కలలపై చాలామంది చాలా రకాలుగా చెబుతారు. కలలనేవి మనిషి మానసిక స్థితిని బట్టి ఉంటాయని కొందరు చెబితే..మరికొందరైతే జరిగేది , జరగనున్న శుభ, అశుభాలకు సూచకాలని మరి కొందరు చెబుతారు. కలలకు మతపరంగా కొన్ని వివరణలు, సైన్స్ పరంగా మరికొన్ని వివరణలున్నాయి. ఏది ఎలా ఉన్నా కలలనేవి రెండు రకాలు. పగటి కలలు, రాత్రి కలలు. కలలు మనిషి మానసిక స్థితిని బట్టి ఉంటాయనేది చాలామంది చెప్పేమాట. అయితే శాస్త్రాలు అంటే మతం మాత్రం వేరేగా చెబుతోంది. వచ్చే కలలు శుభం, అశుభానికి సంకేతాలనేది పండితుల మాట. కొన్ని కలలు భయంకరంగా ఉన్నా ఫలితం మాత్రం బాగుంటుందట. అదే కలల్లో (Dreams Interpretation) ఆనందం కన్పిస్తే మాత్రం నిజ జీవితంలో అశుభం జరగడానికి సంకేతాలని మరి కొందరంటారు. 

కొంతమందికి కలల్లో..పాములు లేదా చితి కన్పిస్తోందా..దానికి అర్ధమేంటో తెలుసుకుందాం. మీకు కలలో చచ్చిన పాము కన్పిస్తే..సహజంగానే భయం కలుగుతుంది. కానీ ఇది శుభానికి ప్రతీక అట. దీనర్ధం ఏంటంటే..మీ జీవితంలో ఉండే దుఖాలు, ఇబ్బందులు ఇకపై తొలగిపోతాయని అర్ధం. రాహువు ప్రభావం ముగియడానికి సంకేతమట. ఇక మీ కలలో మృతదేహం కన్పించడం కూడా శుభసూచకమేనట. మృతదేహాం కన్పిస్తే అశుభమని భావిస్తాం గానీ..శుభసూచకమనేది పండితుల మాట. ఆర్ధికంగా ఎదుగుతారనేందుకు సూచకమట.

ఇక ఎవరైనా వ్యాపారి కలలో మృతదేహం కన్పిస్తే మాత్రం చాలా శుభసూచకమని అర్ధం. ఊహించని అతి పెద్ద ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందని అర్ధమట. అంటే ధనరాశి వచ్చిపడిపోతుందని అర్ధం. ఎవరైనా వృద్ధులకు కలలో మృతదేహం కన్పించినా కూడా దానర్ధం శుభసూచకమే. ఏదో ఒక రోగం నుంచి విముక్తి కల్గుతుందనేందుకు సంకేతమని (Dreams Meaning) అర్ధమట. కలలో చితి కాలుతున్న దృశ్యం కన్పిస్తే మాత్రం..అది కచ్చితంగా అశుభ సూచకమేనట. ఇలా కన్పించడం..మీ సోదరుడితో లేదా సమీప బంధువుతో తీవ్రమైన వివాదానికి సంకేతమట. బంధాలు దూరమవుతాయనేందుకు ఇది సంకేతమట. మరి మీకు ఎటువంటి కలలు వస్తున్నాయో పరిశీలించుకోండి.

Also read: Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో మరో సరికొత్త ఫీచర్, అడ్మిన్లదే ఆ అదికారమిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News