Top Private Armies: ప్రపంచంలో అతి ప్రమాదకర, శక్తివంతమైన ప్రైవేట్ ఆర్మీలు ఇవే

Top Private Armies: ప్రతి దేశానికి ప్రత్యేకమైన ఆర్మీ, పోలీసు విభాగంతో పాటు వివిధ రకాల భద్రతా దళాలు ఉంటాయి. అంతర్గత శాంతిభద్రతల్ని పోలీసులు పర్యవేక్షిస్తే, విదేశాల్నించి ఎదురయ్యే ముప్పు నుంచి ఆర్మీ రక్షిస్తుంది. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో.

Top Private Armies: కానీ కొన్ని దేశాల్లో ప్రైవేట్ ఆర్మీలు భారీగా ఉంటాయి. చాలా దేశాలు డబ్బులిచ్చి ప్రైవేట్ ఆర్మీ సేవల్ని ఉపయోగించుకుంటుంటాయి. ప్రపంచంలోని టాప్ ప్రైవేట్ ఆర్మీల గురించి తెలుసుకుందాం..
 

1 /5

వేగ్నర్ గ్రూప్  వేగ్నర్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది రష్యాకు చెందింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా వేగ్నర్ గ్రూప్ ఆర్మీ వార్తల్లోకెక్కింది. చాలా దేశాల్లో సక్సెస్‌పుల్‌గా ఆపరేషన్ నిర్వహించాయి. వేగ్నర్ గ్రూప్‌లో 6 వేలకు పైగా సైన్యం ఉంది. 

2 /5

ట్రిపుల్ క్యానోపీ ఈ ఆర్మీలో దాదాపు 2 వేలమంది ఉన్నారు. అమెరికా...ఇరాక్ నుంచి తన సైన్యాన్ని వెనక్కి రప్పించినప్పటి నుంచి ఈ ఆర్మీ ఆక్కడ ఉంది. 

3 /5

డిఫైన్ ఇంటర్నేషనల్ డిఫైన్ ఇంటర్నేషనల్ లో వేలాదిమంది సైన్యం ఉంది. ప్రతి నెలా 82 వేల జీతం లభిస్తుంది. ఈ ప్రైవేట్ సైన్యం పెరూ దేశంలో ఉంది. ఈ ఆర్మీ ఆఫీసులు దుబాయ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, ఇరాక్ దేశాల్లో ఉన్నాయి. ఇరాక్ యుద్ధంలో అమెరికా ఈ ఆర్మీ సేవల్ని విస్తృతంగా ఉపయోగించుకుంది. 

4 /5

ఏజిస్ డిఫెన్స్ సర్వీసెస్ ఏజిస్ డిఫెన్స్ సర్వీసెస్‌లో దాదాపు 5 వేలమంది సైనికులున్నారు. ఈ ఆర్మీ యూఎన్ఓ, అమెరికా, ఆయిల్ కంపెనీల కోసం పనిచేస్తుంది. ఏజీస్ ప్రధాన కార్యాలయంలో స్కాట్లండ్‌లో ఉంది. 60కు పైగా దేశాల్లో వీటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

5 /5

అకాడమీ అకాడమీ అనేది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ప్రైవేట్ మిలిట్రీ ట్రైనింగ్ సంస్థ. మిడిల్ ఈస్ట్‌తో పాటు న్యూ ఓర్లీన్స్‌లో కత్రినా హరికేన్ సమయంలో సహాయక చర్యలు అద్భుతంగా నిర్వహించింది. జపాన్‌కు చెందిన మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ భద్రత చేపట్టింది.