CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..

Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.

1 /5

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు,లోక్ సభ స్థానాకులు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ఎన్నికలు కూడా ముగిశాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో మే 13 న ఎన్నికలు జరుగనున్నాయి.

2 /5

ఇప్పటికే ఈసీ రెండు తెలుగు రాష్ట్రాలపై స్పెలస్‌ ఫోకస్ పెట్టింది.అనేక మంది నాయకులపై కేసులు పెట్టింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులపైకేసులు పెట్టింది. అంతేకాకుండా నోటీసులు కూడా జారీచేసింది. ఈ క్రమంలో కొందరు అధికారులను ఎన్నికల విధులకుదూరంగా కూడా ఉంచింది.  

3 /5

ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టింది. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం అవగాహాన కార్యక్రమాలు చేపట్టింది. ఇక మరోవైపు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంను గంట పాటు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.  

4 /5

ఇక తెలంగాణలో ఎన్నికల రోజు హైదాబాద్, ఖమ్మం, వరంగల్,కరీంనగర్ జిల్లాలోని ఓటర్లకు ర్యాపీడో ఫ్రీ సర్వీసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఓటర్లను ఉచితంగా ఓటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తామని ర్యాపీడో కొద్దిగంటల క్రితమే ప్రకటించింది. అదే విధంగా తాజాగా,తెలంగాణ సీఎస్ శాంతికుమారీ కీలక ఉత్తర్వులు జారీచేశారు.

5 /5

మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.అదే విధంగా అన్ని జిల్లాలోని అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులకు కూడా ఆదేశించారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ కు వచ్చి, తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొవాలని కూడా సీఎస్  సూచించారు.