Samantha Top Movies: సమంత కెరీర్‌ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే..

Samantha top Movies :సమంత (Samantha Ruth Prabhu) తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా అడుగుపెట్టి దాదాపు దశాబ్దంన్నర కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. హీరోయిన్‌గా  ఈమె కెరీర్‌లో టాప్ మూవీస్ విషయానికొస్తే..

1 /9

ఏమాయ చేసావే.. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో  సమంత కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమాలో తన మాజీ భర్త నాగ చైతన్యతో జోడిగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

2 /9

బృందావనం.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ 'బృందావనం'. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరో కథానాయికగా నటించింది. సమంత సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

3 /9

దూకుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో  నటించిన మూవీ 'దూకుడు'. ఈ మూవీతో సమంత తొలి హాట్రిక్ హిట్‌ను అందుకుంది.

4 /9

ఈగ.. రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన మూవీ 'ఈగ'. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించింది. లవర్‌ను కోల్పోయిన యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.

5 /9

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వెంకటేష్, మహేష్ బాబు తొలిసారి కలిసిన నటించిన మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు'. ఈ మూవీలో సమంత మహేష్ బాబు సరసన నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

6 /9

అత్తారింటికీ దారేది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ 'అత్తారింటికీ దారేది'. ఈ మూవీలో శశిగా ఒదిగిపోయిన తీరు అత్యద్భుతం. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.  

7 /9

మనం..   ఇక అక్కినేని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్యతో పాటు చివర్లో అఖిల్ హీరోలుగా నటించిన సినిమా 'మనం'. ఈ చిత్రంలో సమంత ప్రియ పాత్రలో ఒదిగిపోయింది. ఈ మూవీ తర్వాత అక్కినేని వారి ఇంటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.

8 /9

జనతా గ్యారేజ్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 

9 /9

రంగస్థలం.. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' మూవీ సమంత కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. వీటితో పాటు మజిలీ, ఓ బేబి, యశోదా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు తమిళంలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలున్నాయి.