Samantha@14 Years: సినీ ఇండస్ట్రీలో 14 యేళ్లు కంప్లీట్ చేసుకున్న సమంత.. ఫ్యాన్స్ సంబరాలు..

Samantha: సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అంతేకాదు కథానాయికగా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు సమంతకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.

1 /8

నాగ చైతన్య హీరోగా నటించిన 'ఏమాయా చేసావే' మూవీతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది సమంత. ఈ మూవీలో జెస్సీ పాత్రలో సామ్ నటనను ఎవరు మరిచిపోలేదు. అపుడు మొదలైన సామ్ ప్రయాణం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

2 /8

14 యేళ్ల కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలతో అలరించింది. అందులో 'శాకుంతలం' వంటి పౌరాణిక మూవీ కూడా ఉంది. అటు లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి మెప్పించింది.

3 /8

ఏమాయా చేసావే, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో బృందావనం, మహేష్ బాబుతో దూకుడు వంటి వరుస హిట్స్‌తో తొలి మూడు సినిమాలతోనే హాట్రిక్ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

4 /8

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగ'లో ప్రేమికుడిని కోల్పోయిన యువతి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికీ దారేది' మూవీలో శశిగా ఒదిగిపోయిన తీరు ఎవరు మరిచిపోలేదు.

5 /8

ఇక అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సినిమాలో ప్రియ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా తర్వాత వారింటి కోడలు కావడం యాదృచ్ఛికమే అనే చెప్పాలి.

6 /8

అటు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి ఈమె జీవితంలో కీ రోల్ పోషించాయి. అటు విడాకుల తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తోంది.

7 /8

అటు వెబ్ సిరీస్‌లో కూడా రాణిస్తోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో నటించిన సామ్.. త్వరలో 'సిటాడెల్' వెబ్ సిరీస్‌తో పలకరించబోతుంది. త్వరలో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించబోతుంది.

8 /8

ఆ మధ్య మయసిటీస్‌తో బాధపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. మళ్లీ ఫిట్‌నెస్ పై శ్రద్ధ వహించింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్.