Rashmika Mandanna: రష్మిక మందన్న బీచ్ ఫోటోస్.. మరింత అందంగా

Rashmika Mandanna Instagram Pics: రష్మిక మందన్న గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. నాగశౌర్య హీరోగా చేసిన ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత తెలుగులో వరస అవకాశాలు అందుకుంది.

2 /5

ముఖ్యంగా రష్మిక విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా తెలుగులో ఆమెకు బ్లాక్ బస్టర్ విజయం అందించింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.  

3 /5

పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ రష్మికకు బాలీవుడ్ లో సైతం ఆఫర్లను తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే సందీప్ రెడ్డివంగా దర్శకత్వం లో వచ్చిన యానిమల్ సినిమా ఆమెకు మరో బ్లాక్ బస్టర్ విజయం అందించింది.  

4 /5

ఇక ఇదే క్రేజ్ తో సల్లూ భాయ్ తో నటించే ఛాన్స్ సైతం కొట్టేసింది ఈ హీరోయిన్. కాగా మరో పక్క సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది.

5 /5

తాజాగా బీచ్ లో అందాల విందు చేసింది ఈ నటి.. సముద్రపు ఒడ్డున బికినీలో మెరుస్తూ.. రష్మిక షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ హీరోయిన్ సముద్రపు సొరచేపలా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు..ఆమె అభిమానులు.