PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.

Benefits Of PPF: ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.

1 /5

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) ఖాతా తెరిస్తే, ప్రతి నెలా డబ్బును నిర్ణీత తేదీలోగా జమచేయండి. లేనిపక్షంలో అనేక ప్రయోజనాలను మీరు కోల్పోవచ్చు. ఇందుకు ఓ కారణం ఉంది. పీపీఎఫ్ ఖాతాలో పలు విధాలుగా డబ్బు జమ చేయవచ్చు. మీరు ప్రతి నెలా బ్యాంకు, పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేయలేకపోతే, మీరు ఆన్‌లైన్‌లోనూ డబ్బు జమ చేయండి. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

2 /5

ప్రతినెలా 5వ తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయని ఆర్థికవేత్తలు చెబుతారు. పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని అందుతుంది. 5వ తేదీ నుంచి నెలాఖరు మధ్య జమ చేసిన నగదు మొత్తంపై వడ్డీ అందిస్తారు. దాంతోపాటుగా రూ.1.50 లక్షల వరకు పొదుపు మొత్తంపై పన్ను మినహాయింపు కల్పిస్తారు.

3 /5

ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ECS) ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేయవచ్చు. ఈ సందర్భంలో నగదు మొత్తాన్ని నెలవారీగా ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకులో ఈసీఎస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ పూర్తయితే ప్రతినెలా నిర్ణీత సమయంలో మీ బ్యాంక్ ఖాతా నుండి పిపిఎఫ్ ఖాతాకు స్వయంగా నగదు బదిలీ అవుతుంది. Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

4 /5

ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా పీపీఎఫ్ నగదు జమ చేయవచ్చు. మీరు మీ పీపీఎఫ్ ఖాతా నంబర్ మరియు మీ పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ యొక్క ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మీతో ఉంటే NEFT విధానంలో మీరు ఎప్పుడైనా డబ్బు బదిలీ చేయవచ్చు. (Image/PIXABAY)

5 /5

మీ బ్యాంక్ ఖాతా మరియు పీపీఎఫ్ ఖాతా రెండూ ఒకే బ్యాంకులో ఉన్నట్లయితే నగదు జమ చేయడం మరింత సులువు అవుతుంది. ఈ సౌకర్యం సులభం. మీరు మీ సేవింగ్స్ అకౌంట్ నుండి పిపిఎఫ్ ఖాతాకు ప్రతి నెలా సులభంగా డబ్బును బదిలీ చేయవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. దీన్ని రూ.3 లక్షల వరకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. (Image/PIXABAY) Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు